సినిమాల్లో పాపులర్ ఆర్టిస్టు సురేఖావాణి. అక్క నుంచి అత్త వరకు అనేక పాత్రల్లో తెలుగు వారిని అలరించింది సురేఖా. ఆమెకు ఒక్కగానొక్క కూతురు సుప్రీత. భర్త చనిపోయినప్పటి నుంచి కూతురే లోకంగా బతుకుతోంది సురేఖ. వీరిద్దరూ  తల్లీకూతుళ్లే అయినా చూడటానికి అక్కాచెల్లెళ్లలా ఉంటారు. తరచూ వీరిద్దరూ కలిసి డ్యాన్సులు, యోగా చేస్తూ ఆ వీడియోలు ఇన్ స్టాలో పోస్టు చేస్తుంటారు. గతంలో వీరిద్దరూ పొట్టి నిక్కర్లు వేసుకుని చేసిన ఓ వీడియో యూట్యూబ్ ను హీటెక్కించింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్సు చేసి ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేశారు. అందులో సురేఖా తన కూతురికి పోటీగా ముదురు ఆకుపచ్చ గౌను వేసుకుని డ్యాన్సు చేసింది. సుప్రీత కూడా పొట్టి గౌనులో అదరగొట్టింది.  


పొట్టి గౌనులతో వీరు వేసిన డ్యాన్సు లైకులు బాగనే పడ్డాయి. ఈ డ్యాన్సు చూసిన కొంతమంది  నెటిజన్లు తల్లీ కూతుళ్లా.. అక్కాచెల్లెళ్లా అని ప్రశ్నించారు. ఇక కూతురు సుప్రీత కూడా డ్యాన్సులో అమ్మకు పోటీగా ఇరగదీసింది. త్వరలో హీరోయిన్‌గా మెరవబోతోంది. కూతురిని హీరోయిన్ చేయాలంటూ కలలు కంటున్న సురేఖ కోరిక త్వరలోనే తీరనున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే సుప్రీత హీరోయిన్ గా ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సురేఖ తనకున్న పరిచయాల ద్వారా ఈ సినిమాను కూతురి కోసం తీసుకొచ్చినట్టు టాక్. సుప్రీతను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం సురేఖ చేయగలదు. ఆ తరువాత నిలబడాలంటే మాత్రం సుప్రీత టాలెంట్, అందం మీదే ఆధారపడి ఉంటుంది.






Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
Also Read: దేశానికి సర్పంచ్ ఏంట్రా? సోగాళ్ళ హంగామా... యాక్షన్ అదిరిందిగా!


Also Read: ఒక్క పోస్ట‌ర్‌, ఒక్క డేట్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్‌!


Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడ‌క్ష‌న్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి