ప్రముఖ యాంకర్, టీవీ హోస్ట్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'. ఈ సినిమాతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. నాని, రాజమౌళి లాంటి సెలబ్రిటీలు ఈ సినిమాను ప్రమోట్ చేశారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
ఏప్రిల్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో సుమ తన మాట తీరుతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సుమ పక్కా పల్లెటూరి మహిళగా కనిపించనుంది. ఆమె కట్టుబొట్టు కూడా అలానే ఉండబోతుంది. ఈ సినిమాలో సుమ ర్యాప్ కూడా పాడడం విశేషం. కథ ప్రకారం.. సినిమా ఎక్కువ భాగం షూటింగ్ శ్రీకాకుళంలో జరిగింది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది సుమ. ఆ తరువాత పూర్తిగా బుల్లితెరకే పరిమితమైంది. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మరి 'జయమ్మ పంచాయతీ'తో సుమ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!
Also Read: ఓటీటీలో 'రాధేశ్యామ్' రిలీజ్ ఎప్పుడంటే?
Also Read: హాలీవుడ్‌ను బీట్ చేసేలా ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', ఆనందంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్