Sudigali Sudheer's Gaalodu Collections : 'సుడిగాలి' సుధీర్ మాస్ - 'గాలోడు'కు బి, సి సెంటర్స్‌లో రికార్డ్ కలెక్షన్స్

Sudigali Sudheer's Gaalodu Movie Box Office Collection : 'సుడిగాలి' సుధీర్‌కు మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉందని, 'గాలోడు' సినిమాకు బి, సి సెంటర్స్‌లో రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

Continues below advertisement

'సుడిగాలి' సుధీర్‌కు స్మాల్ స్క్రీన్ మీద స్టార్ ఇమేజ్ ఉంది. మరి, సిల్వర్ స్క్రీన్‌పై? అతడితో సినిమా తీస్తే మినిమమ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ అనే భరోసాను 'గాలోడు' ఇచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో ఈ సినిమాకు రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి. సుధీర్ (Sudigali Sudheer) కు మాస్ ఆడియన్స్‌లో క్రేజ్ మరోసారి చాటి చెప్పింది. 

Continues below advertisement

బీసీల్లో ఆల్మోస్ట్ హౌస్‌ఫుల్స్!
Gaalodu Movie Box Office Collection : 'గాలోడు' శుక్రవారం విడుదల అయ్యింది. దీంతో పాటు చిన్న సినిమాలు మరో మూడు నాలుగు ఉన్నాయి. అన్నిటిలోనూ ఈ సినిమాకు ఓపెనింగ్స్ బావున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

విశాఖలోని శరత్ థియేటర్‌లో 'గాలోడు' నూన్ షోకి 60 వేల రూపాయలు వచ్చాయి. కిన్నెరలో సుమారు 22వేలు, లీలా మహల్‌లో 30 వేలు వచ్చాయి. శ్రీకాకుళంలోని సరస్వతి థియేటల్‌లో 56వేలకు పైగా వచ్చాయని తెలిసింది. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే బి, సి సెంటర్స్‌లో 'గాలోడు' కలెక్షన్స్ బావున్నాయి.
 
'సుడిగాలి' సుధీర్‌కు ఉన్న క్రేజ్ బి, సి సెంటర్స్‌లో సినిమాకు హెల్ప్ అయ్యింది. ఒక టీవీ సెలబ్రిటీ నటించిన సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం అరుదుగా జరిగే విషయం. 'గాలోడు' సినిమాను కూడా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తీశారు. వాళ్ళు థియేటర్లకు వస్తుండటంతో దర్శక నిర్మాతలు తమ టార్గెట్ రీచ్ అయినట్టే. సుధీర్ ఇంతకు ముందు చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీ మంకీస్' సినిమాలకు కూడా ఓపెనింగ్స్ వచ్చాయి. 

డ్యాన్సులు, ఫైట్లు ఇరగదీసిన సుధీర్!
'గాలోడు' సినిమా కమర్షియల్ టెంప్లేట్‌లో సాగిందని విమర్శకులు చెబుతున్నారు. అయితే... ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఇందులో 'సుడిగాలి' సుధీర్ డ్యాన్సులు, ఫైటులు బాగా చేశారని పేర్కొన్నారు. కమర్షియల్ వేల్యూ ఉన్న స్టార్ హీరోలకు ఇచ్చిన ఎలివేషన్లు సినిమాలో సుధీర్‌కు ఇచ్చారని ఎక్కువ మంది చెప్పారు. వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తే సుధీర్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని చెబుతున్నారు.

'గాలోడు'కు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఫ్రైడే సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన టీమ్, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. సినిమా విడుదలకు ముందు 'జబర్దస్త్'లో సుధీర్ స్కిట్స్ చేయడం... ఒక్క రోజు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, స్టార్ యాంకర్స్ అనసూయ (Anasuya Bharadwaj), రష్మీ గౌతమ్ (Rashmi Gautam) తదితరులు రావడం 'గాలోడు'కు హెల్ప్ అయ్యింది. 

Also Read : 'వండర్ ఉమెన్' రివ్యూ : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా!
   
'సుడిగాలి' సుధీర్‍‍‍‍ సరసన గెహ్నా సిప్పి (Gehna Sippy) కథానాయికగా నటించిన 'గాలోడు' చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మించింది. స‌ప్త‌గిరి, పృథ్వీరాజ్, 'షకలక' శంక‌ర్‌, స‌త్య కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సి. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు.

Continues below advertisement
Sponsored Links by Taboola