Sudigali Sudheer: బుల్లితెరపై పలు షోల ద్వారా పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకుని.. నేడు హీరోగా వెండితెరపై అలరిస్తోన్న సుడిగాలి సుధీర్ నాల్గవ చిత్రంపై క్రేజీ అప్ డేట్ వచ్చింది. '#SS4' అనే టైటిల్ తో నేడు పూజ కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఇక ఈ మూవీలో హాట్ బ్యూటీ దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ ఇటీవలే తెలియజేశారు. 


పాగల్ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తోన్న ఈ '#SS4' మూవీకి చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లక్కీ మీడియా, మహాతేజా క్రియేషన్స్ బ్యానర్స్ తెరకెక్కుతోన్నఈ సినిమాకు .. నేడు గ్రాండ్ ఓపినింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్‌ దామౌదర ప్రసాద్‍ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. 


ఈ సినిమా స్క్రిప్ట్ వన్ ఇయర్ క్రితమే ఫైనల్ అయిపోయిందని నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. 4, 5 నెలల నుండి ప్రీ ప్రొడక్షన్ పనులు గట్టిగా చేశామన్న ఆయన.. ఈ సినిమాకు సంబంధించి బెక్కం వేణుగోపాల్ గారే కర్త, కర్మ , క్రియ అన్నీ ఆయన కొనియాడారు. ఈ మూవీకి లియో మ్యూజిక్ అందిస్తున్నాడని, తమ సినిమాను ప్రేక్షకులు అన్ని విధాలుగా ఆదరిస్తారని కోరుకుంటున్నానని చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.


'#SS4' మూవీ కథను ఒక గంట నేరేట్ చేయగానే సుధీర్.. తనకు బాగా నచ్చిందని ఒప్పుకున్నారని దర్శకుడు నరేష్ కుప్పిలి అన్నారు. తమ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారని... లియో మంచి మ్యూజిక్ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా సినిమాకు రైటర్ గా పనిచేసిన ఫణికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 


ఈ సినిమా ఫస్ట్ షాట్ కి చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారని నిర్మాత బెక్కం వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటివరకు తాను ఎన్నో హిట్ సినిమాలు చేశానని.. ఇది కూడా ఒక హిట్ సినిమా అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శకుడు నరేష్ తో తనకు ఏడేళ్ల పరిచయం ఉందని ఆయన చెప్పారు.


తనను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే అని హీరో సుధీర్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మరో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను పంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 


Also Read ఛత్రపతి రివ్యూ : బెల్లంకొండ బాలీవుడ్ రీమేక్ ఎలా ఉంది? న్యాయం చేశారా? చెడగొట్టారా?


 ప్రముఖ టీవీ షో 'జబర్దస్త్' ద్వారా కమెడియన్ గా తెలుగు వారికి పరిచయమైన సుధీర్.. సుడిగాలి సుధీర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు టీవీ ఛానెల్లో.. పలు షోస్ లో యాంకర్ గా అందర్నీ ఆకట్టుకున్నారు. తన టాలెంట్ సినిమాల్లో అవకాశం దక్కించుకున్న సుడిగాల్ సుధీర్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పించాడు. ఆ తర్వాత వచ్చిన 'సాఫ్ట్‌వెర్ సుధీర్' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. 'వాంటెడ్‌ పండుగాడు' వంటి సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. కానీ ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. గతేడాది రిలీజైనన ‘గాలోడు’ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన హిట్టుతో సుధీర్ హీరోగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.


Also Read 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?