HAROMHARA Trailer Out: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హ‌రోం హ‌ర’. జ్ఞానసాగ‌ర్ ద్వార‌క దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

  


ఆకట్టుకుంటున్న ‘హరోం హర’ ట్రైలర్


పవర్ ఫుల్ యాక్షన్, మాస్ డైలాగ్స్ తో ‘హరోం హర’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పూర్తి స్థాయిలో చిత్తూరు యాసలో కొనసాగుతోంది. సుధీర్ బాబు డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటోంది. గన్స్ తయారీ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. “బలవంతుడికి ఆయుధం అవసరం అయితే, బలహీనుడికి ఆయుధమే బలం అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కాసులు లేకుంటే కొంచెం కూడా మర్యాద ఇవ్వరంటూ ఆయన చెప్పే డైలాగ్ హార్ట్ టచ్చింగ్ గా ఉంది. సుధీర్ ఆయుధాలు తయారీ చేయడం, వాటిని అమ్మే బాధ్యతలు సునీల్ తీసుకున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.


ఒక్కో ఆయుధానికి ఒక్కో సినిమా హీరో పేరు పెడతారు. ఇక ఈ ఆయుధాలను తయారు చేసే వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. “ట్రిగ్గర్ నొక్కేవాడు ఎలాగైనా నొక్కుతాడు. నాకు ఆ ట్రిగ్గర్ చేసినోడు కావాలి” అంటూ లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో సుధీర్ బాబు మేకోవ‌ర్ కూడా అందరికీ నచ్చుతుంది. సునీల్ చక్కటి ప‌ర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.  ‘హ‌రోం హ‌ర’ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డట్లు అర్థం అవుతోంది.  ఆకట్టుకునే విజువల్స్, అద్భుతమైన బీజీఎం, కనీవినీ ఎరుగని యాక్షన్, మాస్ డైలాగ్స్ తో ట్రైలర్ అలరిస్తోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.


Read Also: ‘భజే వాయు వేగం’ కథ విన్నప్పుడు ‘ఖైదీ’ మూవీ గుర్తొచ్చింది, విలన్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ.. కార్తికేయ



జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల


ఇక పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందుతున్న‘హరోం హర’ సినిమాను సుమంత్‌ జి. నాయుడు నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. సునీల్‌, అక్షర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఆసక్తికర కథాంశంతో తీర్చిదిద్దిన ఈ ట్రైలర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.  


Read Also: ముందుగా వారికి క్షమాపణ చెప్పాలి, అదంతా చూసి షాకయ్యా - జపాన్‌ ట్రిప్‌పై జగపతి బాబు కామెంట్స్