Nivetha Pethuraj: టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇందులో నివేదా కారును చెక్ చేయడానికి పోలీసులు తనను ఆపగా.. తను పోలీసులతో వాగ్వాదానికి దిగుతుంది. అయితే ఇదంతా చూసిన నెటిజన్లు మాత్రం ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్ చేస్తున్నారు? పోలీసులు యూనిఫాం వేసుకుని క్రాక్స్ చెప్పులు వేసుకోవడం ఏంటి? అని సెటైర్లు వేస్తున్నారు. ఇంటర్నెట్‌లో తనపై వైరల్ అవుతున్న వీడియో గురించి నివేదా పేతురాజ్.. ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.


పోలీసులతో గొడవ..


వైరల్ అవుతున్న వీడియోలో నివేదా పేతురాజ్ కారును ఆపిన పోలీసులు.. ట్రంక్ ఓపెన్ చేయమని అడుగుతారు. ‘‘రోడ్ వరకు వెళ్తున్నాను. పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి’’ అంటూ పోలీసులు చెప్పిన మాట వినకుండా వారిని డైవర్ట్ చేస్తుంది నివేదా. అయినా సరే పోలీసులు ప్రోటోకాల్ పాటించాలని, డిక్కీ ఓపెన్ చేయండి అంటూ అడుగుతారు. అందులో ఏం లేదని, ఓపెన్ చేయలేనని నివేదా చెప్తుంది. దీంతో విషయం పెద్దగా అవుతుంది. ‘‘ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. నేను ట్రంక్ ఓపెన్ చేయలేను’’ అని చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తుంది. ఇంతలో ఇదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తిని గమనించి తన ఫోన్‌ను పక్కకు తిప్పేస్తుంది నివేదా.






బాగా యాక్ట్ చేసింది..


ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు.. కచ్చితంగా ఇది నిజం కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇందులో పోలీసులు క్రాక్స్ చెప్పులు వేసుకోవడం వల్లే వీడియోను చూసినవారంతా ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని ఫీలవుతున్నారు. మరికొందరు అయితే ఈ వీడియోలో నివేదా బాగా యాక్టింగ్ చేస్తుందని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నివేదా పేతురాజ్ చేతిలో సినిమాలు ఏమీ లేవు. అలాగే తన అప్‌కమింగ్ చిత్రాలపై ఎలాంటి క్లారిటీ లేదు. అందుకే ఇది నివేదా అప్‌కమింగ్ సినిమా కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అయ్యిండవచ్చని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకు ప్రేక్షకులకు ఈ కన్‌ఫ్యూజన్ తప్పదు.


సినిమాలు లేవు..


విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’లో నివేదా పేతురాజ్ చివరిగా కనిపించింది. ఇది 2023లో విడుదలయ్యి క్లీన్ హిట్‌ను సాధించింది. అదే సమయంలో ‘కాలా’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో కూడా నివేదా మెరిసింది. ముందుగా తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నివేదాకు ప్రస్తుతం అక్కడ కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేవు. దీంతో తన అప్‌కమింగ్ మూవీపై ఇంట్రెస్ట్ రావాలంటే ఇలాంటి ఒక పబ్లిసిటీ స్టంట్ చేయాలని భావించి ఉంటుందని, అందుకే ఈ వీడియో వైరల్ అయ్యేలా చేస్తున్నారని నెటిజన్లు అనుకుంటున్నారు.


Also Read: నన్ను వాళ్లు మోసం చేశారు, వారి ట్రాప్‌లో పడకండి.. జాగ్రత్త - జగపతి బాబు షాకింగ్‌ కామెంట్స్‌