ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి' సినిమా తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేశారు. రీసెంట్ గా విడుదల చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఓ డైలాగ్ ను రివీల్ చేశారు. ఇప్పుడు ఆ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 


Also Read:'ఇది కార్నర్ గేమ్..' ఈ వారం ఎవరెవరు నామినేట్ అవుతారో..


హైదరాబాద్ లోని ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్ కపిల్ దేవ్, దర్శకుడు రాజమౌళి, డాక్టర్ రవి తంగరాల పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి.. ముందుగా కపిల్ దేవ్ పై తన ప్రేమను తెలియజేశాడు. కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్ ను లైవ్ లో చూడకపోయినా… గాల్లో ఉన్న బంతిని కపిల్ క్యాచ్ అందుకున్న క్షణాన తమ గుండె ఆగిపోయినంత సంతోషం, ఉద్వేగం కలిగిందని అన్నారు రాజమౌళి. ఆ తరువాత ఛాయిస్ ఫౌండేషన్ పిల్లల కోసం పడుతున్న కష్టం గురించి చెప్పుకొచ్చారు. 


అనంతరం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఓ డైలాగ్ ను అభిమానులతో పంచుకున్నారు. అదేంటంటే.. ''యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం''. ఈ డైలాగ్ వినగానే ఆడిటోరియంలో అరుపులు వినిపించాయి. ఇక థియేటర్లో రచ్చ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే సినిమాలో ఈ డైలాగ్ ఏ క్యారెక్టర్ తో పలికిస్తారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


Also Read: 'పక్కా కమర్షియల్' టీజర్.. గోపీచంద్ మార్క్ యాక్షన్..


Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..


Also Read: రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. హిందీ రిలీజ్ పక్కా..


Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..


Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి