బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని పదో వారంలోకి ఎంటర్ అయింది. ఇప్పటివరకు హౌస్ నుంచి మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేషన్ ప్రాసెస్ ను మొదలుపెట్టేశారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమోలు బయటకు వచ్చాయి. తాను నామినేట్‌ చేయాలనుకున్న నలుగురు హౌస్ మేట్స్ ను ఎంచుకుని వాళ్లని జైలులోకి పంపించాలని.. ఆ జైలు తాళాలను లివింగ్‌ రూమ్‌లో పెట్టాలని కెప్టెన్‌ యానీ మాస్టర్‌కి బిగ్‌బాస్‌ సూచించాడు. 


Also Read: 'పక్కా కమర్షియల్' టీజర్.. గోపీచంద్ మార్క్ యాక్షన్..


దాంతో యానీ మాస్టర్‌.. సన్నీ, కాజల్‌, షణ్ముఖ్‌, మానస్‌లను నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం, బజర్‌ మోగిన వెంటనే లివింగ్‌ రూమ్‌లో ఉన్న తాళాలను ఎవరైతే ముందుగా చేజిక్కించుకుంటారో వాళ్లు.. తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ని జైలు నుంచి బయటకు తీసుకురావొచ్చని బిగ్‌బాస్‌ మిగిలిన ఇంటిసభ్యులకు సూచించాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ అందరూ నామినేషన్ గురించి, ఇతర ఇంటి సభ్యుల గురించి మాట్లాడుతూ కనిపించారు. 


'పింకీ వెళ్లిపోతే మానస్ పరిస్థితి ఏంటి..?' అంటూ షణ్ముఖ్, రవితో డిస్కషన్ పెట్టాడు. సన్నీ ఉన్నాడుగా అంటూ రవి అన్నాడు. ఆ తరువాత జైల్లో ఉన్న సన్నీ 'అపనా టైం ఆయేగా' అంటూ పాట పాడగా.. దానికి యానీ 'అందరికి టైం వస్తాదని' రియాక్ట్ అయింది. 'ఇది కార్నర్ గేమ్' అంటూ జైల్లో ఉన్న మానస్.. కాజల్ కి చెప్తూ కనిపించాడు. రవి-శ్రీరామ్-జెస్సీ జైలు నుంచి ఎవరిని బయటకు తీసుకురావాలో డిస్కస్ చేస్తూ కనిపించారు. ప్రోమో చివర్లో జైల్లో ఉన్న నలుగురిలో ఒక్కరినే బయటకు తీసుకురాగలనని.. ఎవరిని తీసుకురావాలో మీరే చెప్పమని జైల్లో ఉన్నవారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు శ్రీరామ్.