'పెళ్లి సందD' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక శ్రీ లీల (Sreeleela). దర్శ కేంద్రులు కె. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన సినిమా కావడంతో... తెలుగులో తొలి చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మొదటి సినిమా విడుదలకు మలి అవకాశం అందుకుంది. ఇప్పుడు శ్రీ లీల పేరు చెబితే... మాస్ మహారాజా రవితేజకు జంటగా ఆమె నటించిన 'ధమాకా' సినిమా గుర్తుకు వస్తుంది. ఈ నెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఆ సినిమా కంటే ముందు శ్రీ లీల నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదేంటో తెలుసా?
డిసెంబర్ 17న 'ఐ లవ్ యు ఇడియట్
'I Love You Idiot Movie : తెలుగులో కంటే ముందు శ్రీ లీల కన్నడలో సినిమాలు చేశారు. కథానాయికగా ఆమె పరిచయమైనది కన్నడలోనే! శ్రీ లీల తొలి సినిమా 'కిస్'. ఇప్పుడు ఆ సినిమాను 'ఐ లవ్ యు ఇడియట్' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 17న థియేటర్లలోకి సినిమా రానుంది.
'ఐ లవ్ యు ఇడియట్' చిత్రాన్ని తెలుగులో అవిరుద్ర క్రియేషన్స్ పతాకంపై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో నిర్మాతలు సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఏపీ అర్జున్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. ఇటీవల ట్రైలర్ కూడా విడుదల చేశారు.
ఇప్పుడు తెలుగులో శ్రీ లీలకు క్రేజ్ ఉంది కాబట్టి... దాన్ని క్యాష్ చేసుకోవడానికి 'కిస్'ను 'ఐ లవ్ యు ఇడియట్' పేరుతో విడుదల చేస్తున్నారనుకుంటే పొరబాటే. కన్నడలో సినిమా తీసేటప్పుడు తెలుగులోనూ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. కథానాయికగా అవకాశం ఇచ్చినప్పుడు... ప్రమోషన్స్‌కు అందుబాటులో ఉంటానని చెప్పిన శ్రీ లీల, ఇప్పుడు తెలుగులో తనకు క్రేజ్ ఉండటంతో దర్శక నిర్మాతలకు ముఖం చాటేస్తున్నారని సమాచారం. అదీ విషయం! క్రేజ్ వస్తే అంతే మరి!
''చిన్న సినిమాలకు మద్దతుగా నిలిచే బెక్కెం వేణుగోపాల్ గారు మా సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది'' అని ఏపీ అర్జున్ చెప్పారు. ''శ్రీ లీల అందం, అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. బెక్కెం వేణుగోపాల్ గారి సమర్పణలో మా సినిమా విడుదల అవుతుండటం మాకు సంతోషం'' అని నిర్మాత సాయికిరణ్ బత్తుల అన్నారు. ఈ చిత్రానికి పాటలు : పూర్ణాచారి, సంగీతం : వి. హరికృష్ణ, ఛాయాగ్రహణం : అర్జున్ శెట్టి.
Also Read : నటి వీణా కపూర్ దారుణ హత్య - తల్లిని చంపి నదిలో పడేసిన కుమారుడు
'పెళ్లి సందD' ఫ్లాప్ అయినప్పటికీ... శ్రీ లీల చేతిలో సినిమాలు ఉండటంతో ఆమె కెరీర్ మీద పెద్ద ప్రభావం పడలేదు. 'ధమాకా', ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం భారీ ఎఫెక్ట్ ఉంటుంది. పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత చిన్న చిన్న నిర్మాతలను పట్టించుకోవడం మానేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి.