Bigg Boss 6 telugu: ముందు సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ సీజన్ 6 నిరాశజనకంగానే ఉంది. కానీ ఈ సీజన్ చెప్పగానే గుర్తొచ్చే పేర్లలో కచ్చితంగా టాప్ 2లో ఉంటుంది ఇనాయ సుల్తానా. ఈ సీజన్లో గట్టిగా ఆడింది ఇద్దరే వారు ఇనాయ, రేవంత్. మొదటి వారం నుంచి ఇనాయ ఫైట్ చేస్తూనే ఉంది. అంతెందుకు విన్నర్ మెటీరియల్‌గా చెప్పుకుంటున్న రేవంత్ కు మొదటి పదివారాలు గట్టి పోటీ ఇచ్చింది కూడా ఇనాయనే. ఆమె ఓటింగ్లో ఎక్కువ వారాలు రెండో స్థానంలోనే కొనసాగింది. గత మూడు వారాలుగా రోహిత్ దూసుకొచ్చాడు. మెరీనా ఇంట్లోంచి వెళ్లిపోవడం ఆయనకు కలిసి వచ్చింది. ఇప్పుడు రేవంత్ మొదటిస్థానంలో ఉండగా, రోహిత్ రెండో స్థానంలో, ఇనాయ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అలాంటిది ఈ వారం ఇనాయను ఎలిమినేట్ చేశారనే సమాచారం రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 


శ్రీసత్య కన్నా దారుణమా? 
ఆట ఆడుతోంది, ఓట్లు కూడా పడుతున్నాయి... అయినా ఇనాయ ఎందుకు ఎలిమినేట్ అయి ఉంటుంది? అందరికీ ఈ సందేహం వస్తుంది. దీనికి జవాబు కేవలం బిగ్ బాస్ టీమ్ మాత్రమే చెప్పగలరు. ఆమె లేకపోతే నామినేషన్లలో కిక్కే ఉండదు. చాలా ఎపిసోడ్లు కేవలం ఆమె మీదే నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అబ్బాయిలతో పోటీ పడుతూ ఆడిన ఆడిన ఒకే ఒక అమ్మాయి ఇనాయ సుల్తానా. అందులోనూ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్లో ఈమె చాలా స్ట్రాంగ్. శ్రీసత్య, కీర్తి కన్నా ఈమె ఆటలో ఎంతో బెటర్. ముఖ్యంగా శ్రీసత్యతో పోల్చుకుంటే ఇనాయ చాలా విషయాల్లో ఉత్తమం అని చెప్పవచ్చు. 


శ్రీసత్యపై వచ్చినంత ట్రోలింగ్స్ ఈ సీజన్లో ఎవరి మీద వచ్చి ఉండవు. ఈ వారం శ్రీసత్య వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు, కానీ ఈసారి ఇనాయను పంపించేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఇది ఇంటి సభ్యులకే కాదు, చూస్తున్న ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్. శ్రీసత్య అనధికార ఓటింగ్ చూస్తూ చాలా తక్కువే ఉంటుంది. ఇనాయ ఓటింగ్‌లో ఆమెకు సగం ఓటింగ్ మాత్రమే పడుతున్నాయి.అయినా కూడా ఇనాయ సుల్తానాను ఎలిమినేట్ చేశారు.






రన్నర్ అవుతుందనుకుంటే...
విన్నర్ రేవంత్ అని రన్నర్ అని ఇనాయ అని ఒక నిర్ణయానికి వచ్చేశారు ప్రేక్షకులు. హఠాత్తుగా  రోహిత్  దూసుకొచ్చాడు. దీంతో రేవంత్ - రోహిత్ లలో ఒకరు విన్నర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. ఇనాయ మాత్రం టాప్ 5లో కచ్చితంగా ఉంటుందని అందరికి అనిపించింది. ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య మీద ఆటలో ఇనాయనే బెటర్. అయినా ఈమె ఎలిమినేట్ చేయడం మాత్రం షాకిచ్చినా, ప్రేక్షకుల్లో బిగ్‌బాస్ కార్యక్రమంపై నెగిటివ్ ఫీలింగ్స్ రావడం ఖాయం. 


Also read: ఇంట్లో ఇమిటేషన్ టాస్క్, అదరగొట్టిన ఇనాయ, శ్రీసత్య