Bigg Boss 6 Telugu: ప్రోమో చూశాకే ఆ రోజు ఎపిసోడ్ చూడాలా వద్దా అని నిర్ణయించుకుంటారు ప్రేక్షకులు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో చూడగానే ప్రేక్షకులకు నచ్చేసింది. దీంతో ఈ ఎపిసోడ్ చూసిన వారు అధికంగానే ఉన్నట్టు అంచనా. ఇక ఎపిసోడ్లో ఏమైందంటే... శ్రీసత్య ముందురోజు దెయ్యాల గదిలోకి వెళ్లడానికి భయపడడంతో ఆమెను మళ్లీ ఈరోజు పంపారు. ఆమెకు తోడుగా కీర్తిని కూడా పంపారు. దెయ్యాల గదిలో శ్రీసత్య అరుపులతో గోల చేసింది. ఆమె భయపడడమే కాదు, కీర్తిని కూడా ఆడనివ్వలేదు. చివరికి ఎలాగోలా బొమ్మను తీసుకుని బయటపడ్డారు. తరువాత రోహిత్ వెళ్లాడు. కాసేపటికే అందరినీ దెయ్యాల గదిలోకి పిలిచారు. బిగ్ బాస్ వెతకమన్న టోపీ తీసుకుని అందరూ బయటికి వచ్చేశారు.
ఎంటర్టైన్ చేయమని
బిగ్ బాస్ గతంలో ఇంట్లో జరిగిన సంఘటనలను రీక్రియేట్ చేసి, తనను ఎంటర్టైన్ చేయమని అడిగారు. దీంతో శ్రీహాన్ పిట్ట గొడవను రీక్రియేట్ చేశారు. ఇందులో శ్రీసత్య ఇనయాగా, రేవంత్ శ్రీహాన్‌గా నటించారు. వీరిద్దరూ ఇరగదీశారు. అలాగే గీతూలా నటించిన ఇనాయ కూడా చాలా బాగా నవ్వించింది. తరువాత హోటల్ టాస్కులో శ్రీసత్య - అర్జున్ కళ్యాన్ మధ్య కెమిస్ట్రీని రీక్రియేట్ చేశారు. ఇందులో శ్రీహాన్ అర్జున్ కళ్యాణ్‌గా, ఇనాయ శ్రీసత్యగా, శ్రీసత్య సుదీపగా నటించింది. ఈ సమయంలో ఇనాయ - శ్రీహాన్ మధ్య రొమాన్స్ అదిరింది. అలాగే రోహిత్ ఫైర్ అయిన ఘటనను కూడా రీక్రియేట్ చేయమని ఆదేశించారు. రోహిత్‌లా ఇనాయ అదరగొట్టింది.
అలాగే పాత కంటెస్టెంట్లను ఇమిటేట్ చేశారు ఇంటి సభ్యులు. ఇది చాలా అలరించింది. ముఖ్యంగా శ్రీహాన్ బాలాదిత్యలా నటించాడు. ఇది చాలా నవ్వించింది. ఇక ప్రైజ్ మనీ 47 లక్షల దాకా చేరింది. తానే విన్నర్ అని ఫిక్స్ అయిపోయిన రేవంత్ ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటే చాలా ఆనందపడ్డాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్లో ఆదిరెడ్డి, రేవంత్, కీర్తి, ఇనాయ, రోహిత్ ఉన్నారు. ఫైనలిస్టు కావడంతో శ్రీహాన్ నామినేషన్లలో లేడు.ఇక వీరిలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. అలా అయితే ఫైనల్‌కి అయిదుగురే వెళతారు. అలా కాకుండా ఒకరినే ఎలిమినేట్ చేస్తే ఫైనల్‌కి ఆరుగురు వెళతారని అనుకోవచ్చు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also read: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?