‘బిగ్ బాస్’ ఇక ముగింపు దశకు వచ్చేసింది. దీంతో వివిధ టాస్కులతో ఫన్ క్రియేట్ చేసే పనిలో ‘బిగ్ బాస్’ ఉన్నాడు. ఇందులో భాగంగా విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బుని తిరిగి సంపాదించుకోవడానికి తాజాగా ‘బిగ్ బాంబ్’ పేరుతో టాస్క్ ఇచ్చాడు. ఇందులో రేవంత్, ఇనయా, శ్రీసత్య పాల్గొన్నారు. మరోవైపు దెయ్యాల గది టాస్క్‌తో ఫన్ క్రియేట్ చేస్తున్నాడు ‘బిగ్ బాస్’. అయితే, అందులో కంటెస్టెంట్లు కాస్త అతి చేస్తు్న్నారనే కామెంట్లు వస్తున్నాయి.
అయితే, తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ‘బిగ్ బాస్’.. ఇంటి సభ్యులను క్యారెక్టర్స్ మార్చుకోమని చెప్పాడు. దీంతో అంతా వేర్వేరు హౌస్ మేట్స్ ఫొటోలను మెడలో వేసుకుని తమ ప్రతాపం చూపారు. ఆయా క్యారెక్టర్లలోకి పరకాయ ప్రవేశం చేసి.. అచ్చం వారిలాగానే ప్రవర్తించారు. ఈ సందర్భంగా మంచి ఫన్నే క్రియేట్ అయ్యిందనిపిస్తోంది. ముఖ్యంగా ఇనయా, శ్రీహాన్‌లు తమ పాత్రల్లో జీవించారు. అంతేకాదు.. పనిలో పనిగా ఆ పాత్రల పేరుతో రొమాన్స్ కూడా పండించారు. వాస్తవానికి శ్రీహాన్, ఇనయాల మధ్య పెద్ద గొడవలే జరిగేవి. ఇద్దరూ శత్రువుల్లా ఉండేవారు. అయితే, ఈ మధ్య ఇద్దరూ కాస్త కూల్‌గా ఉంటున్నారు. ఛాన్సు దొరికినప్పుడు రొమాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. మొన్నటి వరకు కొట్టుకున్నవారు ఇప్పుడు కలిసిపోవడం.. ఆడియన్స్‌కు కూడా నచ్చుతోంది. ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో కూడా దెయ్యాల గది ఫన్ కొనసాగనుంది.
ఉదయం రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. శ్రీసత్యని మరొకసారి బిగ్ బాస్ కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. ఒక్కదాన్నే చీకటి గదిలోకి రావడం తన వల్ల కాదని సత్య చెప్పేసరికి బిగ్ బాస్ తనకి తోడుగా కీర్తిని కూడా లోపలికి రమ్మని చెప్పాడు. వాళ్లిద్దరికి నరకం చూపించాలని రేవంత్ బిగ్ బాస్ తో చెప్పాడు. ఇక అమ్మాయిలిద్దరూ కన్ఫెషన్ రూంలోకి రాగానే బిగ్ బాస్ హస్కీ వాయిస్ తో “సత్య రా” అనేసరికి “నేను రాను” అని సత్య అనడం ఫన్నీగా ఉంది. కీర్తి మాత్రం భయపడకుండా నవ్వుతూ ఉంటుంది. అరుపులు కేకలతో బిగ్ బాస్ కేకపెట్టించాడు. సత్యని చూసి కీర్తి “నువ్వే నాకు దెయ్యంలాగా కనిపిస్తున్నావ్” అని అనేసింది. దెయ్యం వేషం వేసుకున్నవ్యక్తిని చూసి కీర్తి, శ్రీసత్య వణికిపోయారు. వాళ్ళ పరిస్థితి చూసి బయట ఉన్న వాళ్ళు తెగ నవ్వుకున్నారు.
Also Read: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్