Sitara Ghattamaneni Interview : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టీ సితార తాజాగా ఇన్​ఫ్లూయెన్సర్స్​తో కలిసి చిట్ చాట్ చేసింది. Mahesh Babu Foundation.. Telugu DMFతో చేతులు కలిపిన సందర్భంగా సితార ఈ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఫౌండేషన్ రాష్ట్రంలోని డిజిటల్ క్రియేటర్స్​ని సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇన్​ఫ్లూయెన్సర్స్​కి హెల్త్ కార్డులు అందించి వారితో చిట్ చాట్ (Sitara Chit Chat With Influencers) చేసింది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. 


ఆమె ఫాలోయింగ్ రేంజ్ వేరు


సితార సినిమాల్లోకి రాకపోయినా.. దాదాపు హీరోయిన్ రేంజ్​లో ఫాలోయింగ్​ని కలిగి ఉంది. ముఖ్యంగా మహేశ్ బాబు ఫ్యాన్స్​ ఆమెను సితార పాప అంటూ ముద్దుగా పిలుస్తారు. సోషల్ మీడియాలో కూడా సితారకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, వెకేషన్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. అయితే ఈ ఇంటర్వ్యూలో సితార తాను ఏమి చదువుతుందో.. ఫ్యూచర్​లో ఏమి అవుతుందో వంటి విషయాలు చెప్పింది. 


నాన్నలా యాక్టర్​ని అవుతా..


తనకు ఫ్యూచర్​లో తండ్రిలా యాక్టింగ్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది సితార. కొన్ని సంవత్సరాల్లో తమ అభిమాన హీరోయిన్ కూతురిని హీరోయిన్​గా చూస్తామని మహేశ్ బాబు ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఇప్పుడు ఏజ్ చాలా చిన్నది కదా.. మధ్యలో ఇంకేమైనా ప్రోఫెషన్స్ గురించి ఆలోచించినా.. యాక్టర్​గా కచ్చితంగా చేస్తానని చెప్పింది సితార. ప్రస్తుతం 6వ తరగతి నుంచి 7వ క్లాస్​లోకి వెళ్తున్నట్లు సితార ఇంటర్వ్యూలో చెప్పింది. 


చిన్న వయసులోనే గుర్తింపు..


ఇప్పటికే సితార తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. PMJ Jewelsకి బ్రాండ్ అంబాసీడర్​గా చేసింది. ఈ యాడ్​తో సితారకు అతి చిన్న వయసులో ఈ యాడ్ చేసి ఇంటర్నేషనల్​ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ యాడ్ వెనుక ఆమె తల్లి నమ్రతా ప్రభావమే ఎక్కువ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కూతురుని చిన్నప్పటి నుంచే ప్రమోట్ చేస్తుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే మహేశ్ కుటుంబం నుంచి మంజుల హీరోయిన్​గా వచ్చి.. కొన్ని కారణాల వల్ల ఆమె నటిగా రాణించలేకపోయింది. కానీ.. సితారకు ఇప్పుడు హీరోయిన్​ అయ్యేందుకు ఎలాంటి అడ్డు లేదనే తెలుస్తోంది. 


మమ్మీ ఫ్యాషన్ సెన్స్ కావాలి..


తన మమ్మీ ఫ్యాషన్​ సెన్స్​ అంటే తనకు ఎంతో ఇష్టమని.. మా మమ్మీ నుంచి ఇదే నాకు కావాలని కోరుకుంటున్నట్లు సితార తెలిపింది. అలాగే ఇష్టమైన ఫుడ్ మ్యాగీ అని చెప్పింది. గౌతమ్​తో తన రిలేషన్ గురించి అడుగగా.. తన అన్నది తనకంటే చిన్నదైన మనస్తత్వం అని చెప్పింది. గౌతమ్​ ఇరిటేట్ చేసినా.. తనంటే ఎంతో ఇష్టమని చెప్పింది సితార. 


సేవ చేస్తూనే ఉంటుంది..


సితార తన పేరెంట్స్​లాగనే సేవలు కొనసాగిస్తానని చెప్పింది. PMJ Jewelsకి బ్రాండ్ అంబాసీడర్​గా చేసిన ఈ భామ.. దానికి వచ్చిన డబ్బు అంతటి సేవ కార్యక్రమాల కోసం వినియోగించింది. తాజాగా పిల్లలకు సైకిళ్లు కూడా అందించింది. ఇలా చిన్న వయసునుంచే సితార మహేశ్ బాబు ఫౌండేషన్ తరఫున సేవలు చేస్తుంది. 


Also Read : హాట్ రెడ్ శారీలో యాంకర్ మంజూష.. మేడమ్ ఏ చీర కట్టుకున్నా ఆ శారీకే అందమొస్తుందట