బిగ్ బాస్.. ముగింపు దశకు రావడంతో ఇంట్లో ఐదుగురు సభ్యులు.. ఎవరి పెర్‌ఫార్మెన్స్ వాళ్లు ప్రదర్శిస్తున్నారు. సన్నీ జోక్స్‌తో ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తుంటే.. సిరి తన క్యూట్‌నెస్‌తో మెస్మరైజ్ చేసేందుకు ట్రై చేస్తోంది. మానస్ తన మంచితనంతో కట్టిపడేస్తుంటే.. షన్ను ఇంకా అలాగే ఉన్నాడు. నిన్నటి వరకు బిగ్ బాస్ హౌస్‌లోని టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీ.. ప్రజల సహనాన్ని పరీక్షించింది. కంటెస్టెంట్లకు కూడా బోర్ కొట్టిందో ఏమో.. కాసేపు దాగుడు మూతలు.. తదితర చిన్న పిల్లల ఆటలతో కాలక్షేపం చేశారు. అయితే, ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో మరోసారి పాత టాస్క్‌లతో కంటెస్టెంట్లను, ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ ప్లాన్  చేశాడు. గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రమో ప్రకారం.. బిగ్ బాస్ తన కంటెస్టెంట్లకు మళ్లీ టీషర్ట్-స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇచ్చాడు. ఆ తర్వాత రోప్ టాస్క్‌లో పాల్గొన్నారు. ఇందులో సన్నీ, సిరి, షన్నులు పోటీ పడ్డారు. అయితే, సరదాగా సాగుతుందనుకున్న టాస్క్.. సిరి-సన్నీల మధ్య గొడవకు దారి తీసింది. 


నువ్వు ఓడిపోయావ్ అంటూ సన్నీ.. సిరిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే, సిరి మాత్రం దాన్ని పాజిటివ్‌గా తీసుకోలేదు. నేను ఓడిపోయానని అనొద్దని హెచ్చరించింది. ఓడిపోయావ్ అనడం జోకా అంటూ అలిగింది. ఆ తర్వాత మంచంపై షన్ను పక్కన కూర్చున్న ఆమెను కూల్ చేసేందుకు సన్నీ ప్రయత్నించాడు. నేను సరదాగానే ఆ మాట అన్నానని సన్నీ అన్నాడు. అప్పుడు జోక్‌గా అన్నాను.. ఇప్పుడు మాత్రం కాదనేసరికి.. సిరి సీరియస్ అయ్యింది. ‘‘నాపై జోకులు వేయొద్దు’’ అని గద్దించింది. నన్ను ఇమిటేట్ చేయకంటూ వేలు చూపించింది. దీంతో సన్నీ.. ‘‘నాకు వేలు చూపించొద్దు’’ అని సిరిని హెచ్చరించాడు. ‘‘ఏమనుకుంటున్నావ్ సన్నీ నువ్వు? నువ్వు హీరోవా?’’ ఎగతాళి చేసింది. మరి, వీరి గొడవ.. సన్నీకి కలిసి వస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే.. వీరికి ఓటేయడానికి ఇంకా గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి మాత్రమే మిగిలి ఉన్నాయి. 





Also Read: ‘బిగ్ బాస్’ విజేత ఎవరు? ఇలా ఓటేసి విన్నర్‌ను మీరే నిర్ణయించండి


Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు స‌పోర్ట్‌గా మ‌హిళా  మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి