Geetha Madhuri Baby Shower: టాలీవుడ్ లో సింగర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది గీతా మాధురి. నటుడు నందుతో ప్రేమ వివాహం చేసుకున్న ఆమె, ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమెకు దాక్షాయని ఆనే పేరు పెట్టారు. ప్రస్తుతం మరోసారి తల్లికాబోతోంది గీతా మాధురి. ఫిబ్రవరిలో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇప్పటికే ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. గత డిసెంబర్ లో గీతా మాధురి సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది.
అట్టహాసంగా గీతా మాధురి సీమంతం వేడుక
ప్రస్తుతం గీత నిండు గర్భవతిగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు. బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ ఫంక్షన్ లో గీత మరింత అందంగా కనిపించింది. పట్టు చీరలో మెరిసిపోతూ కనిపించింది. ఆకుపచ్చ, ఆరెంజ్ కాంబో చీరలో ఆహా అనిపించింది. ప్రస్తుతం ఈ సీమంతానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు, సినీ అభిమానులు గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆకాంక్షిస్తున్నారు.
2014లో పెళ్లి, 2019లో పాప
గీతా మాధురి, నందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, 2014లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ దంపతులకు సుమారు 5 సంవత్సరాల తర్వాత, అంటే 2019 అమ్మాయి పుట్టింది. ఆమెకు దాక్షాయని ప్రకృతి అనే పేరు పెట్టారు. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది గీతా మాధురి.
ఇండస్ట్రీలో రాణిస్తున్న గీత, నందు
గీతా మాధురి తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్‌గా రాణిస్తోంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అద్భుత గాత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పలు సినిమాల్లో పాడిన పాటలకు గాను బెస్ట్ సింగర్ గా అవార్డులను అందుకుంది. కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. గీతా మాధురి భర్త నందు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. గత కొద్ది కాలంగా యాంకర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా కనిపిస్తున్నారు. మరోవైపు పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. మొత్తంగా భార్యాభర్తలు సినీ ఇండస్ట్రీలో తమ ప్రతిభ చాటుకుంటున్నారు.
Read Also: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సురేఖ వాణి కూతురు, ‘బిగ్ బాస్’ అమర్ దీప్‌తో సుప్రిత కొత్త మూవీ