మొన్నటి వరకు శ్రావణ భార్గవి తన భర్తతో విడిగా ఉంటోందంటూ వార్తలు వచ్చాయి. హేమచంద్ర - శ్రావణ భార్గవి త్వరలో విడాకులు తీసుకుంటారంటూ పుకార్లు వచ్చాయి. వాటికి వారిద్దరూ అవునని కానీ, కాదని కానీ సమాధానం చెప్పలేదు. కొన్ని రోజుల తరువాత ఆ విషయం సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ మరో కొత్త వివాదంతో తెరపైకి వచ్చింది శ్రావణ భార్గవి. అభిషేకం వేళ వేంకటేశ్వర స్వామిని కీర్తించేందుకు అన్నమయ్య రాసిన కీర్తన ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’. దీన్ని శ్రావణ భార్గవి తనదైన శైలిలో పాడి, ఆ పాటలో చీరకట్టుతో తనను అందంగా చిత్రీకరించుకుంది. ఆ వీడియోను యూట్యూబ్ లోని తన ఛానెల్‌లో పోస్టు చేసింది. అది చూసిన అన్నమయ్య కుటుంబసభ్యులు ఆమెపై మండి పడ్డారు. అంతేకాదు నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో కామెంట్లు పెడుతుండడంతో ఆమె కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసింది. 

Continues below advertisement


ఏంటా కాళ్లు ఊపడం?
‘అన్నమయ్య పెద్ద కుమారుడు పెదతిరుమలాచార్యులు స్వామివారికి అభిషేకం చేస్తూ కీర్తించిన పాట అది. ఆ పాటకు ఆమె కాళ్లు ఊపుతూ, ఆమె అందాన్ని వివిధ భంగిమల్లో చూపిస్తూ చిత్రీకరించడం తప్పు’ అని అన్నమయ్య వంశస్థులు తెలిపారు. ఈ విషయంపై శ్రావణ భార్గవికి తాము ఫోన్ చేశామని ఆమె చాలా బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. తమతో పాటూ చాలా మంది ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించమని కోరినా ఫలితం లేదని అన్నమయ్య వంశస్థుల్లో ఒకరైన తాళ్లపాక వెంకటరాఘవ అన్నమాచార్యులు అన్నారు. 


వీడియోలో ఏముంది?
ఒకపరి ఒకపరి వయ్యారమే కీర్తనను తన హస్కీ గొంతుతో పాడింది శ్రావణ భార్గవి. అందులో ఆమె అందమైన చీరకట్టుతో సాధారణ మహిళ చేసే పనులన్నీ చేస్తూ కనిపించింది. బొట్టు పెట్టుకోవడం, పుస్తకాలు చదవడం, నవ్వడం, కాళ్లు ఊపడం... ఇలా ప్రతిది స్లోమోషన్లో చూపించారు. కాకపోతే ఆ ఆ కీర్తనను ఇంతవరకు వేంకటేశ్వరస్వామి వారికి మాత్రమే పాడేవారు. ఇలా తనను తాను అందంగా చూపించుకోవడం కోసం శ్రావణ భార్గవి ఉపయోగించుకునే సరికి చాలా మంది భక్తులు జీర్ణించుకోలేకపోయారు. ఈ పాటను రెండు రోజుల క్రితమే యూట్యూబ్ లో పోస్టు చేసింది శ్రావణ భార్గవి. ఇప్పటివరకు వ్యూస్ దాదాపు  ఆరు లక్షల ఎనభై వేల దాకా వచ్చాయి. 



Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?


Also Read : చిరంజీవి అబద్ధాలకు పడతారు కానీ పవన్ కళ్యాణ్‌ను కన్వీన్స్ చేయడం కష్టమే!