95వ అకాడమీ అవార్డ్స్ కోసం అధికారికంగా నామినేషన్స్ వెల్లడి అయ్యాయి. ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆల్ దట్ బ్రీత్స్’ ఆస్కార్ కు పోటీపడుతుంది. షౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ గాయపడిన పక్షులను రక్షించి, వాటికి చికిత్సనందించే సిబ్లింగ్స్ మొహమ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ కథ ఆధారంగా రూపొందింది. ఈ డాక్యుమెంటరీ స్టోరీ ఇద్దరు సోదరుల బంధం చుట్టూ తిరుగుతుంది. ఇదే కేటగిరీలో ‘ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్, నావల్నీ చిత్రాలు సైతం ఆస్కార్ కోసం నామినేట్ చేశారు. ఇంతకీ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కోసం ‘ఆల్ దట్ బ్రీత్స్’ ఆస్కార్ కు నామినేట్ కావడానికి కారణాలేమిటో చూడండి.
ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న'ఆల్ దట్ బ్రీత్స్'
షౌనక్ సేన్ 'ఆల్ దట్ బ్రీత్స్' వరుసగా రెండవసారి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ పోటీలో భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుంది. గత సంవత్సరం సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ సినిమా డాక్యుమెంటరీలో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌ని గెలుచుకున్నది. 'ఆల్ దట్ బ్రీత్స్' అనే డాక్యుమెంటరీ నదీమ్ షెహజాద్, మహ్మద్ సౌద్ అనే సోదరుల చుట్టూ తిరుగుతుంది. గాలిపటాల కారణంగా గాయపడిని పక్షులను రక్షించి, వారి ఇంటిలో వాటికి చికిత్స చేస్తారు. సమకాలీన భారతీయ మహానగరంలో అభివృద్ధి పేరుతో జనాలు గందరగోళం, డిస్టోపియా మధ్య జీవిస్తూ జీవిస్తున్నారో ఇందులో చూపించారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ ఐ అవార్డు
‘ఆల్ దట్ బ్రీత్స్’ 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ ఐ అవార్డుతో సహా టాప్ డాక్యుమెంటరీ అవార్డులను అందుకుంది. HBO ఈ డాక్యుమెంటరీకి సంబంధించి ప్రపంచవ్యాప్త టెలివిజన్ హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే డైరెక్టర్ సేన్‌కు డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు, ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ అవార్డు దక్కింది. ‘ఆల్ దట్ బ్రీత్స్’ ఈసారి ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ పొందే అవకాశం బలంగా కనిపిస్తోంది.
ఆస్కార్ కు ఎందుకు నామినేట్ అయ్యిందంటే?
సృజనాత్మక నాన్ ఫిక్షన్ లాగా ఉంటుంది ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ. దీనికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అద్భుతమైన విజువల్ సీక్వెన్స్. సగటు డాక్యుమెంటరీతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ డాక్యుమెంటరీలో కాల్పనిక చిత్ర నిర్మాణానికి సంబంధించిన శైలిని పరిచయం చేశారు. ఈ డాక్యుమెంటరీలో స్లైడర్‌లు, ట్రై ప్యాన్‌లు కనిపించవు. ఈ చిత్రం వాస్తవ రూపం మంచి వ్యక్తులు మంచి పనులు చేసేదిగా ఉంటుంది. నదీమ్ షెహజాద్, మహ్మద్ సౌద్ అనే సోదరులు ఎంతో ప్రేమ, దయ కలిగి ఉంటారు. ఢిల్లీలో ఇతర పశుపక్షాదులు ఎలా జీవిస్తున్నాయి అనే విషయాన్ని ఇందులో చూపిస్తారు. ఈ ఇద్దరు సోదరులు గాయపడిని పక్షుల పట్ల ప్రేమగా, దయగా వ్యవహరిస్తారు. వీరిద్దరిని పట్టణ తత్వవేత్తలుగా చూపించే ప్రయత్నం చేస్తారు.
ఈ డాక్యుమెంటరీ సినిమాటోగ్రఫీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. సాహి, బెర్నా, దాస్ సినిమాటోగ్రఫీ మరో లెవల్ లో ఉంటుంది. షెహజాద్, సౌద్ రోజువారీ కార్యకలాపాలను అద్భుతంగా చూపించారు. సమకాలీకరణలో రోజర్ గౌలా హిప్నోటిక్, వైరుధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇందులో వాడిన మానవేతర జీవుల షాట్స్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ‘ఆల్ దట్ బ్రీత్స్’లో దర్శకుడు సహజ ప్రపంచాన్ని కవిత్వీకరించాడు. ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత మనలో కూడా మూగజీవులు, పర్యావరణంపై ప్రేమ పుడుతుంది. అంతగా ఈ డాక్యుమెంటరీ ప్రభావం చూపుతుంది. అందుకే, ‘ఆస్కార్’ నామినేషన్‌లో స్థానం సంపాదించింది.
Read Also: కొంతమంది దర్శకులు రాజమౌళిని చంపేందుకు కుట్ర చేస్తున్నారు, ఆర్జీవీ సంచలన ట్వీట్