మీడియా ప్రతినిధులు చేసే అతి ఒక్కోసారి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఫోటోలకు పోజులివ్వమని అరవడం, ఇష్టం లేదని వినకుండా ఫోటోలు తీయడం ఒక్కోసారి కోపం తెప్పిస్తాయి. సినీ తార విషయంలో ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తూనే ఉంటాం. రీసెంట్ గా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ విషయంలోనూ మీడియా ప్రతినిధులు చేసిన తిక్క చేష్టలు ఆయనకు తిక్కరేపాయి. పిచ్చోళ్లలా ప్రవర్తిస్తున్నారంటూ షాహిద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


మీడియా ప్రతినిధులపై షాహిద్ ఆగ్రహం


షాహిద్ కపూర్ తన భార్య మీరా రాజ్‌పుత్,  అత్తగారు బేలా రాజ్‌ పుత్‌తో కలిసి ముంబైలో జరిగిన  రుహాన్ కపూర్- మనుకృతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. వధూవరులను కలిసి ఆశీర్వదించారు. అందిరీతో సంతోషంగా గడిపారు. ఈ వెంటను నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కారు దగ్గరికి చేరాడు. మీరా, బేలా అక్కడే నిలబడడ్డారు. ఈ సమయంలో వారిని ఫోటోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు ఎగబడ్డారు. ఒక్క ఫోటో, ఒక్క ఫోటో అంటూ అరిచారు. మీడియా ప్రతినిధుల తీరు ఆయనకు కోపం తెప్పించింది. ఫొటోగ్రాఫర్లు అరవడం నచ్చని షాహిద్.. పిచ్చోళ్లలాగ చేస్తున్నారని మండిపడ్డారు. మిమ్మల్ని పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్తున్నప్పుడు అలా చేయడంలో అర్థం ఉంది కానీ, ఇక్కడే ఉన్నా ఎందుకు అరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మీకు కావాల్సినన్ని ఫోటోలు ఇచ్చే వెళ్తాను అరవకండి అంటూ కోపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






షాహిద్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం


షాహిద్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వీళ్లును హీరోగా చేసిందే మీడియా. వారి మీదనే ఇప్పుడు కోపం తో అరుస్తున్నారు. అంటూ అంటూ మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను అస్సలు మీడియా పట్టించుకోకపోతే బాగుంటుందని సూచిస్తున్నారు.  ఇక షాహిద్ సినిమాల విషయానికి వస్తే, ఆయన చివరిసారిగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘బ్లడీ డాడీ’లో కనిపించాడు. ఇందులో సంజయ్ కపూర్, డయానా పెంటీ, రోనిత్ రాయ్, రాజీవ్ ఖండేల్వాల్, అంకుర్ భాటియా,  వివాన్ భటేనా కీలక పాత్రలు పోషించారు. ఇది 2011 ఫ్రెంచ్ చిత్రం ‘స్లీప్‌లెస్ నైట్’ నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ చిత్రాన్ని గతంలోనే కమల్ హాసన్ ‘తూంగా వనం’ (2015)పేరుతో రీమేక్ చేశాశారు. ఇక ఆయన ప్రధాన పాత్రలో నటించి ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో నకిలీ నోట్లను తయారు చేసే ఆర్టిస్టులా ఆకట్టుకున్నాడు.


Read Also: 'జవాన్' ట్రైలర్‌ తో డ్రగ్స్ కేసుకు లింక్, ఆర్యన్ ఖాన్ ఏమన్నాడో తెలుసా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial