మాదాపూర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. ఎట్టకేలకు కోలుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. థమ్స్ అప్ చూపిస్తూ.. ‘‘నా మీద, నా చిత్రం ‘రిపబ్లిక్’ సినిమాపై మీరు చూపించిన ప్రేమ, అప్యాయతలకు ధన్యవాదాలు అనే పదం చాలా చిన్నది. త్వరలోనే మిమ్మల్ని చూస్తాను’’ అని ఆయన ట్వీట్ చేశాడు. దీంతో టాలీవుడ్ అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. సాయి ధరమ్ తేజ్ స్వయంగా ఈ ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.






సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు. అయితే, ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ స్పందించకపోవడంతో.. అతడి ఆరోగ్యం ఎలా ఉందనే ఆందోళన అభిమానుల్లో ఉంది.  ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తేజ్‌ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది.


ప్రమాదం జరిగిన రోజు నుంచి అపస్మారక స్థితిలో ఉన్న తేజ్ ఇప్పుడు స్పృహలోనే ఉన్నారని, సెప్టెంబరు 20న వెంటిలేటర్‌ కూడా తొలగించామని వైద్య బృందం వెల్లడించింది. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ శ్వాస తీసుకోడానికి ఇబ్బందిపడ్డాడు. దీంతో వైద్యులు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. ప్రస్తుతం తేజ్ తనంతట తానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. దీంతో ఐసీయూ నుంచి సాధారణ గదికి షిఫ్ట్ చేశారు. ఆరోగ్యం కూడా మెరుగుపడటంతో  తేజ్‌ త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.  


Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?


ప్రమాదం జరిగిన దాదాపు మూడు వారాల తర్వాత సాయి ధరమ్ తేజ్ తమ అభిమానులను ట్విట్టర్ ద్వారా పలకరించారు. ఆయన ఆరోగ్యం కోలుకోవాలని అభిమానులు ఎంతో కోరుకున్నారు. కొందరు ఆలయాల్లో కూడా పూజలు చేయించారు. తేజ్ ఆరోగ్యం గురించి కలత చెందవద్దని చిరంజీవి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. దీంతో తేజ్.. తన అభిమానులకు ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకున్నాడు. 


Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?


Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి