సామ్ - చైతుల జంటను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించారు. వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే.. తమ ఇంటి పెళ్లిగా భావించారు. పెళ్లిలో సమంత భావోద్వేగాకి గురవ్వుతున్న చిత్రాన్ని చూసి.. ఒక అమ్మాయికి అంత కంటే గొప్ప అనుభూతి ఏముంటుందంటూ కళ్లు చెమర్చారు. గత కొద్ది రోజులుగా వారు విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలు విని.. అవి నిజం కాకపోతే బాగుంటుందని అనుకున్నారు. కానీ, ఆ సస్పెన్స్‌కు సమంత - నాగ చైతన్య జంట తెరదించారు. తాము ఇష్టపూర్వకంగా విడిపోతున్నామని ప్రకటించారు.
ఎంతో ఇష్టపడి.. రెండు సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్న ఆ బంధం మరింత బలంగా ఉండాలేగానీ.. ఇలా బలహీనమవుతుందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మరి, ఈ బంధం బీటలు వారడానికి గల కారణాలేమిటనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా.. ప్రీతమ్ జుకల్కర్ అనే ఫ్యాషన్ డిజైనర్, సమంత పర్శనల్ స్టైలిస్ట్ చేసిన ట్వీట్ లేనిపోని అనుమానాలకు దారి తీస్తోంది.
విడాకుల తర్వాత.. ప్రీతమ్ జుకల్కర్ విష్ చేయడమే కాకుండా ఓ అభ్యంతరకరమైన పదాన్ని వాడాడు. ‘కంగ్రాట్స్ S**t, అతడు ఇక నీవాడే’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టాడు. దాని తర్వాత ‘‘అబద్దాలు, రహస్యాలు బంధాలని చంపేస్తాయి. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక రోజు దొరికిపోతావ్’’ అని పేర్కొన్నాడు. అయితే, ఈ కామెంట్లు సమంతాను ఉద్దేశించినవి కాదని తెలుస్తోంది. కానీ, సమంత-చైతూ జీవితంలోకి వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి గురించి చేసినవేనని మాత్రం స్పష్టమవుతుంది. అతడు S**t అనే దారుణమైన పదాన్ని ఓ అమ్మాయిని టార్గెట్ చేసి పెట్టినట్లుగా ఉంది. ఆమె వల్లే సమంతా-చైతు బంధం విడిపోయినట్లుగా అతడి తర్వాతి స్టేటస్‌ను బట్టి తెలుస్తోంది. అందుకే ఆమెకు ప్రీతమ్ ‘కంగ్రాట్స్’ చెప్పినట్లు తెలుస్తోంది. ‘ఎదో ఒక రోజు దొరికిపోతావ్’ అనడం ఇందుకు బలాన్ని ఇస్తోంది. ఎందుకంటే.. సామ్‌కు స్నేహితుడిగా ప్రీతమ్ అలాంటి పదాలు వాడటం అసాధ్యం. దీంతో నెటిజనులు.. చైతూ-సామ్ జీవితంలో మరెవ్వరైనా ఉన్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు సమంత చేసిన వ్యాఖ్యలు కూడా బలాన్ని ఇస్తున్నాయి. ‘‘నేను బాధలో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తాయి. చరిత్రను చూస్తే అర్థమవుతుంది చివరకు గెలిచేది ప్రేమ, సత్యం మాత్రమేనని. ఆ చరిత్రలో కనిపించకుండా కుట్రలు చేసే నియంతలు, హంతకులు ఉంటూనే ఉన్నారు. కానీ వారికి చివరికి పతనం తప్పదు. ఈ విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి’’ అనే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా సమంత ఆ అజ్ఞాత వ్యక్తి గురించేనని అర్థమవుతోంది. చాలామంది ఈ వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీ గురించని అనుకుంటున్నారు. కానీ, తప్పకుండా ఆమె కామెంట్లు ఆ అజ్ఞాత వ్యక్తి కోసమే.
Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
ప్రీతమ్ జుకల్కర్ ఆమెకు స్టైలిష్ మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు కూడా. ఆమె కెరీర్‌లో పైకి రావడానికి సహకరించిన వ్యక్తుల్లో అతడు కూడా ఒక్కడు. అయితే, ఈ బంధాన్ని చాలా తప్పుగా భావిస్తూ గతంలో విమర్శలు చేశారు. వాస్తవానికి జుకల్కర్ ఆమెను ‘అక్క’ అని పిలుస్తాడు. అందుకే వారు చనువుగా ఉంటారు. కొద్ది నెలల కిందట సమంత అతడి ఒడిలో కాళ్లు పెట్టుకుని తీసుకున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో చాలామంది ఆమెను ట్రోల్ చేశారు. అక్కినేని ఇంటి కోడలై ఉండి అలా చేస్తావా అంటూ నెగటివ్ కామెంట్లు చేయడంతో ఆమె ఆ పోస్టును డిలీట్ చేయాల్సి వచ్చింది.
Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?
ఇటీవల ప్రీతమ్ బర్త్ డే సందర్భంగా ఈ క్రమంలో సమంత చెప్పిన విషెస్ వైరల్ అయ్యాయి. ‘‘హ్యాపీ బర్త్ డే మై ప్రీతమ్ జుకల్కర్.. నా జీవితంలో నువ్వు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాతో పాటు వచ్చినందుకు థ్యాంక్స్. ఐ లవ్యూ సో మచ్’’ అని సమంత పేర్కొంది. ఇందుకు ప్రీతమ్ స్పందిస్తూ.. ‘‘థాంక్యూ సో మచ్ జీజీ’’ అని రిప్లై ఇచ్చాడు. అయితే, జీజీ అంటే హిందీలో ‘అక్క’ అని అర్థం. కానీ, దానికి అర్థం తెలియనివారు అప్పటికే ఆమెపై నెగటీవ్ కామెంట్లతో ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టారు. నాగ చైతన్యతో పోల్చితే.. సమంతా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఏ విషయాన్ని దాచకుండా ధైర్యంగా పోస్టులు పెడుతుంది. చైతూతో పోల్చితే ఫాలోవర్లు కూడా ఆమెకే ఎక్కువ. దీంతో అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొనేది కూడా ఆమెనే. విడాకుల తర్వాత కూడా చాలామంది సమంతనే ట్రోల్ చేస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో బోల్డ్ సన్నివేశాల వల్లే అక్కినేని ఫ్యామిలీ హర్ట్ అయ్యారని అంటున్నారు. కానీ, ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. దానిపై నిర్ణయం తీసుకొనే హక్కు పూర్తిగా వారికే ఉంటుంది. అయితే, సెలబ్రిటీల కావడం వల్ల ప్రస్తుతం ప్రజలు, మీడియా ఫోకస్ అంతా వారి జీవితాల పైనే ఉంటోంది. చెప్పాలంటే.. నాగార్జున బిగ్ బాస్‌లో చెప్పే ‘‘మీ ఇంటిపైనే కాకుండా మా ఇంటిపై కూడా ఓ కన్నేసి ఉంచండి’’ అనే డైలాగును ప్రజలు, మీడియా సీరియస్‌గానే తీసుకున్నారనిపిస్తోంది.
Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం