మోస్ట్ అవైటింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ గురువారం థియేటర్లో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. అందులో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లోకి రానుంది. నేడు విడుదలైన ట్రైలర్ ను చూశాక ఒక్కొక్కరికి గూస్‌బంప్స్ వచ్చాయి. సాధారణ ప్రజలతో పాటూ ప్రముఖులూ ఈ ట్రైలర్ పై స్పందించారు. సమంత కూడా ఈ ట్రైలర్ పై ట్వీట్ చేసింది. ఇందులో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది.
రామ్ చరణ్‌ను ఉద్దేశించి ‘ఆన్‌స్క్రీన్ పై నేను చూసిన బెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇది’ అంటూ చెర్రీ... అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న ఫోటోను షేర్ చేసింది.
ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రస్తావిస్తూ ‘ఎలాంటి సందేహం లేదు, ఇది నిజంగా వందశాతం నమ్మదగినదే, మీ కళ్లల్లో ఉన్న అగ్నితో మీరు ఏమైనా సాధించగలరు’ అని క్యాప్షన్ పెట్టింది.
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!