హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడం, ఆ తర్వాత కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకోవడం, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడం తెలిసిన విషయాలే. దీపావళికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబుతో మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలు ఫొటో దిగారు. "అందరి ఆశీస్సులు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులు అందరికీ ఇది నిజమైన పండుగ" అని చిరంజీవి ట్వీట్ చేశారు. "నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకు, మీ ప్రార్ధనలకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను" అని సాయి తేజ్ అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.
ఫొటోల్లో సాయి తేజ్‌ నవ్వుతూ... ఆరోగ్యంగా కనిపించారు. మరి, షూటింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? అంటే... 'జనవరిలో' అని తెలుస్తోంది. సాయి తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్ మీద ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షెడ్యూల్స్ ప్లానింగ్ జరుగుతోంది. ఒకవేళ సాయి తేజ్‌ ఇంకొన్ని రోజులు విశ్రాంతి అవసరమని భావిస్తే... ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లాలని అనుకుంటున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ సినిమా ఇది.
రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయి తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' సినిమా విడుదలైంది. ఆ సినిమా చిత్రీకరణ ప్రమాదానికి ముందే పూర్తయింది. అందువల్ల, ఎటువంటి సమస్యలు రాలేదు. అయితే... ప్రచారానికి సాయి తేజ్ రావడం కుదరలేదంతే.  సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ప్రస్తుతం బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నారు.



Also Read: విజయ్ దేవరకొండ vs మైక్ టైసన్... వేగాస్‌లో ఇద్ద‌రి మ‌ధ్య ఫైట్‌!
Also Read: డిసెంబ‌ర్‌లో కీర్తీ సురేష్ డ‌బుల్ ధ‌మాకా... ఇటు గురి, అటు హిస్టరీ!
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి