విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లైగర్'. సాలా క్రాస్ బ్రీడ్... అనేది ఉపశీర్షిక. బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మీద సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 'లైగర్' షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, సినిమా యూనిట్ గత వారం అమెరికాలోని వేగాస్ వెళ్లిన సంగతి తెలిసిందే. లేటెస్టుగా వేగాస్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ పాల్గొనగా... బాక్సింగ్ నేపథ్యంలో ఫైటింగ్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు.





"ద లెజెండ్ వర్సెస్ లైగర్... ఫైటింగ్ సీక్వెన్స్ మొదలు" అని యూనిట్ సోషల్ మీడియాలో పేర్కొంది. మైక్ టైస‌న్‌తో ఉన్న ఫొటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మైక్ టైసన్‌తో ఉన్న ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నాను. ఇవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే" అని ఆయన పేర్కొన్నారు.





ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థాయ్‌లాండ్‌ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేస్తున్నారు. అనన్యా పాండే కథానాయికగా, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెక్స్ట్ ఇయర్ సినిమాను విడుదల చేయనున్నారు.

Also Read: డిసెంబ‌ర్‌లో కీర్తీ సురేష్ డ‌బుల్ ధ‌మాకా... ఇటు గురి, అటు హిస్టరీ!
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి