రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తేజ్ త్వరగా కోలుకుని రావాలని సెలబ్రెటీలు, అభిమానులు కోరుకుంటున్నారు. స్పందించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఇదే సమయంలో పోలీసులపై ఆర్పీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘యాక్సిడెంట్ విషయంలో అతివేగంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ చర్యల వల్ల నగరంలో మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
Alos Read:తేజ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దన్న చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల ట్వీట్లు
ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని మాదాపూర్ ఏసీపీ ఇప్పటికే చెప్పారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని వాహనాన్ని అదుపుచేయలేకపోయారని స్పష్టం చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళనం చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
Also read:తెలుగు సినిమా హీరోలకు బైకులంటే ఎందుకంత మోజు..
108 సిబ్బంది ద్వారా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని తేజ్ ను ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఆర్పీ పట్నాయక్ కామెంట్స్ పై పోలీసులు ఎలా రియాక్టవుతారో చూడాలి. నెటిజన్లు మాత్రం ఆర్పీ మాట్లిడింది కరక్టే కదా అంటున్నారు
Also Read: సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ
Also Read: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..