సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా పూజాకార్యక్రమాలు మొదలయ్యాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది. ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు మహేష్ బాబు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. 


ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాదాపు ఆరు రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగింది. దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబుకి యాక్షన్ కొరియోగ్రాఫర్లు అంబు, అన్విలతో విబేధాలు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం యాక్షన్ సీన్ మొత్తం రీషూట్ చేయాల్సి ఉంటుంది. అలా జరిగితే నిర్మాతకు కోట్లలో నష్టాలు తప్పవు. స్టార్ హీరో సినిమా అంటే రోజుకి యాభై లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుంది. అలా చూసుకుంటే మహేష్ సినిమాకి ఇప్పటివరకు కోట్లలో ఖర్చయి ఉంటుంది. మరి ఈ ప్రచారంపై చినబాబు స్పందిస్తారేమో చూడాలి.


ఇప్పటినుంచే ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలపై నిర్మాతలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్ కోసం నిర్మాతలు రూ.23 కోట్లు కోట్ చేస్తున్నట్లు సమాచారం. అది కాకుండా.. సౌత్ లో నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్ కోసం రూ.100 కోట్లు అడుగుతున్నారట. వీటితో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థతో డిజిటల్ రైట్స్ కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కి సంబంధించిన బేరాలు నడిపించడం లేదు. 


నైజాంలో సినిమా హక్కులు రూ.45 కోట్ల రేంజ్ లో ఉంటాయట. ఆంధ్రలో రూ.50 కోట్లు, సీడెడ్ లో రూ.20 కోట్ల రేంజ్ లో అమ్మాలని చూస్తున్నారు. ఇవన్నీ ఫిక్స్ అయితే రూ.140 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ మీద, మరో రూ.140 కోట్ల నాన్ థియేట్రికల్ రైట్స్ మీద దక్కించుకోవాలని చూస్తున్నారు నిర్మాతలు. ఎలాగో బేరాలు ఉంటాయి కాబట్టి అటు ఇటు చూసుకున్నా.. ఈ సినిమాతో రూ.250 నుంచి రూ.280 కోట్ల బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఆ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో లేదో చూడాలి!


తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
 


Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ


Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్