నెట్‌ఫ్లిక్స్(Netflix)లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన ‘ది విట్చర్’ (The Witcher) సీజన్-3 ఎట్టకేలకు షూటింగ్ ముగించుకుని.. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ సీరిస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మాంచి విజువల్ వండర్‌గా ఈ వెబ్‌సీరిస్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దీనికి లభించిన పాపులారిటీని సొమ్ము చేసుకొనేందుకు ‘ది విట్చర్’ ప్రీక్వెల్‌ను యానిమేటెడ్ సీరిస్‌‌ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు చాలామంది ‘ది విట్చర్’ సీజన్-3 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, కరోనా వైరస్ వల్ల ఈ సీరిస్ షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్నో సవాళ్ల మధ్య దర్శక నిర్మాతలు ఈ వెబ్ సీరిస్ షూటింగ్‌ను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. Netflix సంస్థ సోషల్ మీడియా ద్వారా ‘The Witcher: Blood Origin’ డేట్‌ను ప్రకటించింది. డిసెంబరు 25 నుంచి ఈ వెబ్ సీరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 


వాస్తవానికి ఈ సీజన్‌ను 2023లో విడుదల చేయాలని భావించారు. అయితే, ఊహించిన తేదీ కంటే ముందే క్రిస్మస్‌ను పురస్కరించుకుని తాజా సీజన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సీజన్-1, 2లలో ఎనిమిదేసి ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్-3లో కూడా ఎనిమిది ఎపిసోడ్స్ ఉండే అవకాశాలున్నాయి. ఒక మంత్రగాడు, మంత్రగత్తె మధ్య ప్రేమ, ఓ రాకుమారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో భారత సంతతి నటి అన్య చలోత్రా.. మంత్రగత్తె యెన్నెఫర్ పాత్రలో నటించింది. హెన్నీ కావిల్ విట్చర్‌గా, ఫ్రెయా అల్లన్ సిరిల్లా సిరి పాత్రల్లో నటించారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహా వెబ్ సీరిస్‌లను ఇష్టపడేవారికి ఇది కూడా నచ్చుతుంది. మీరు ఇంకా చూడనట్లయితే రెండు సీజన్లను ఇప్పుడే పూర్తిచేసేయండి. 






Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ


Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్