సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో భారీ విజయాలు సాధిస్తున్నాయి. హిందూ మైథాలజీ నేపథ్యంలో రూపొందిన 'కార్తికేయ 2', 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాలు సైతం భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అందువల్ల, రామాయణం ఆధారంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' సినిమా కోసం మీద ప్రేక్షకుల దృష్టి పడింది.


హిందీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్'లో ప్రభు రామ్ పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు. ఈ సినిమాలో సోనాల్ చౌహన్ (Sonal Chauhan) కూడా ఉన్నారు. సూర్పణక పాత్రలో ఆమె నటించినట్లు సమాచారం. అయితే... తాను ఏ పాత్రలో నటించినదీ ఆవిడ వెల్లడించడం లేదు. కానీ, 'ఆదిపురుష్' గురించి గొప్పగా చెప్పారు (Sonal Chauhan Interview - Adipurush Movie).


నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్
''నేను 'ఆదిపురుష్' గురించి ఏం చెప్పాలి? దేశం మొత్తం ఆ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ప్రతి ఒక్కరికీ తెలుసు... నేను ప్రభాస్‌కు వీరాభిమాని అని! ఆ సినిమా చేయడం సంతోషంగా ఉంది. అటువంటి సినిమా చేయడం అంటే హిస్టరీలో ఒక భాగం కావడమే. 'ఆదిపురుష్' యూనిట్ నుంచి నాకు ఫోన్ వచ్చినప్పుడు వెంటనే ఓకే చెప్పేశా'' అని సోనాల్ చౌహన్ తెలిపారు. 


నా క్యారెక్టర్ గురించి మాట్లాడలేను!
'ఆదిపురుష్'లో సూర్పణక పాత్ర చేశారా? అని సోనాల్ చౌహన్‌ను ప్రశ్నించగా... స్పష్టమైన సమాధానం చెప్పలేదు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె రాలేదన్నారు. తాను కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని తెలిపారు.


ఈ తరం రామాయణం, మహాభారతం గురించి తెలుసుకోవాలి!
ఈ తరం యువతీ యువకులు రామాయణం, మహాభారతం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హీరోయిన్ సోనాల్ చౌహన్ తెలిపారు. తన తల్లిదండ్రులు చిన్నతనంలో రామాయణం, మహాభారతం చూపించాన్నారన్నారు. మన సంస్కృతీ సాంప్రదాయాలను ఈ తరం అర్థం చేసుకోవాలన్నారు. తాను 'ఆదిపురుష్' చిత్ర బృందంతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు తనకు రామాయణం గురించి తెలుసని,అప్పుడు తనకు గర్వంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు.


Also Read : చిరంజీవితో వస్తున్నాం కానీ ఆయనకు పోటీగా కాదు


ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ పరంగా 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్ చేస్తుందని సోనాల్ చౌహన్ తెలిపారు. టెక్నికల్ పరంగా ఎంతో అడ్వాన్స్డ్‌గా సినిమా తీస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రతి అంశంలోనూ 'ఆదిపురుష్' సరికొత్త మార్పులు తీసుకు వస్తుందని ఆవిడ అభిప్రాయపడ్డారు. చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ను 'జీనియస్'గా అభివర్ణించారు.  


సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించిన 'ది ఘోస్ట్' సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్కినేని నాగార్జునకు జోడీగా, సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారమె. 'ది ఘోస్ట్' కోసం గన్స్ పట్టుకోవడంతో పాటు ఎంఎంఎంలో ట్రైనింగ్ తీసుకున్నట్లు సోనాల్ చౌహాన్ తెలిపారు. ప్రతి కథానాయికకు యాక్షన్ సినిమా చేయాలని ఉంటుందని, తనకు ఈ సినిమాతో చేసే అవకాశం లభించిందని ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు.    



Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!