లక్ష్మీ మంచు (Lakshmi Manchu) మంచి నటి, దర్శకురాలు, రచయిత మాత్రమే కాదు... వ్యాఖ్యాత కూడా! ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్టీటాస్కింగ్ పర్సన్ అన్నమాట. లక్ష్మీ మంచు భోజన ప్రియురాలు కూడా! ఆవిడ చేస్తున్న షోస్‌లో 'షెఫ్ మంత్ర' ఒకటి. 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఆ షో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు 'షెఫ్ మంత్ర' సీజన్ 2తో లక్ష్మీ మంచు అండ్ ఆహా ఓటీటీ రెడీ అయ్యింది.


సెప్టెంబర్ 30 నుంచి 'షెఫ్ మంత్ర 2' షురూ!
సినిమా తారలు... వెండితెరపై సందడి చేసే వారితో పాటు తెర వెనుక సంగీతం, దర్శకత్వం వంటి కీలక బాధ్యతలు నిర్వహించే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? వారు ఏం చేస్తారు? ఏం తింటారు? తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులలో ఉంటుంది. తమకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పడం మాత్రమే కాదు... గరిట చేత పట్టుకుని వంట చేస్తే? చూడముచ్చటగా ఉంటుంది కదూ! సెలబ్రిటీలతో వంట చేయించే కార్యక్రమమే... 'షెఫ్ మంత్ర'.


'షెఫ్ మంత్ర' ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అది ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు రెండో సీజన్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ నెలాఖరున... సెప్టెంబర్ 30 నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 'షెఫ్ మంత్ర 2' ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. 


ఎనిమిది ఎపిసోడ్స్... ఇంకా స్టార్స్!
'షెఫ్ మంత్ర' సీజన్ 2లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయని 'ఆహా' పేర్కొంది. ఎపిసోడ్స్ ఎనిమిది మాత్రమే అయినప్పటికీ... స్టార్స్ మాత్రం చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఒక్కో ఎపిసోడ్‌లో ఇద్దరు ముగ్గురు స్టార్స్ సందడి చేసే ఛాన్స్ ఉందట.   


హ్యాపీ హ్యాపీగా లక్ష్మీ మంచు... 
'షెఫ్ మంత్ర' సీజన్ 2 స్టార్ట్ కానున్న సందర్భంగా లక్ష్మీ మంచు మాట్లాడుతూ ''మా మంచు కుటుంబంలో అందరూ భోజన ప్రియులే. డైనింగ్ టేబుల్ దగ్గర మేమంతా కలిసినప్పుడు ఎన్నో మాట్లాడుకుంటాం. మంచి ఫుడ్ ఉంటే ఆ రోజు చాలా బాగా గడిచిపోతుంది. ఇప్పుడు నేను ఒక ఫుడ్ షో హోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ షోను ఇష్టపడతారని ఆశిస్తున్నాను'' అని తెలిపారు. ఇటీవల ఈ 'షెఫ్ మంత్ర 2' ప్రోమో విడుదల అయ్యింది. వైరల్ అవుతోంది.



Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?



సినిమాలకు వస్తే... తండ్రి మోహన్ బాబు (Mohan Babu)తో కలిసి లక్ష్మీ మంచు (Lakshmi Manchu) ఫస్ట్ టైమ్ నటిస్తున్న సినిమా 'అగ్ని నక్షత్రం'. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తుంది.ఇందులో డైనమిక్ సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. లక్ష్మీ మంచు క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్రలో, మలయాళ నటుడు సిద్దిక్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విశ్వంత్ కథానాయకుడు. చిత్రా శుక్లా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. 



Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?