'వయసు 30 దాటేసింది. జుట్టు కూడా (ఊడుతుంది). పొట్ట కూడా వచ్చేసింది. మా కులంలో అమ్మాయిలు దొరకడం లేదు. కొంచెం ఏమైనా సంబంధం ఉంటే చూసి పెట్టొచ్చు కదా!' - 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో విశ్వక్ సేన్ డైలాగ్ ఇది. హీరో క్యారెక్ట‌ర్‌ను, కథను ద‌ర్శ‌కుడు 90 సెకన్లలో చెప్పారు. ఆ తర్వాత నుంచి సినిమాను కొత్తగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు విశ్వక్. 'పిల్లను వెతికి పెట్టండి... పిల్లను వెతికి పెట్టండి' - సోషల్ మీడియాలో ఒక్కటే రిక్వెస్ట్. ఇప్పుడు తనకు పిల్ల దొరికేసిందని ఆయన వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో కథానాయికను పరిచయం చేశారు. ఇందులో విశ్వక్ సేన్ జోడీగా రుక్సార్ థిల్లాన్ కనిపించనున్నారు.


'దొరికింది... పెళ్లికి పిల్ల దొరికేసింది' అని విశ్వక్ సేన్ సంతోషంగా మైక్ లో అరిచి మరీ చెప్పగా... 'దొరికింది? దొరికే దాకా ఒక్కటే బాధ, దొరికిన తర్వాత మొదలు అవుతాయి వెయ్యినూట పదహారు (బాధలు)! ఉన్నవి కూడా ఊడిపోతాయ్. పిల్ల దొరికిందట... పిల్ల!' అని 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ భయపెట్టడం బావుంది. అప్పుడు 'పిల్ల బావుంది. మాధవి తన పేరు. పసుపులేటి మాధవి' అని రుక్సార్ థిల్లాన్‌ను పరిచయం చేశారు.

విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందిస్తున్నారు. 

Also Read: నువ్ వర్జిన్ ఆ? అమ్మాయి అలా అడిగేసరికి... 'స్వాతిముత్యం' గ్లింప్స్ చూశారా?
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... క‌రోనా బారిన మ‌రో సెల‌బ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి