తనకు, చరణ్‌కు మధ్య ఏర్పడిన బంధానికి ఆర్ఆర్ఆర్ ముగింపు కాదు.. ఆరంభం మాత్రమేనని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తారక్ మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి థ్యాంక్స్. తమిళ డైలాగ్ రైటర్ మదన్ కార్కీకి కూడా థ్యాంక్స్. తమిళ డబ్బింగ్ చెప్పడంలో మీరు ఎంతో సాయం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్‌బీ చౌదరి, కలైపులి ఎస్.థానులకు థ్యాంక్స్.’
‘రాజమౌళి బాహుబలితోనే ప్రాంతీయ సినిమా పరిమితులను చెరిపేశారు. ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి సినిమా చేసి చాలా కాలం అయింది. అప్పట్లో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చేశారు. భారతీ రాజా దర్శకత్వంలో అది సాధ్యం అయింది. ఇప్పుడు మళ్లీ రాజమౌళి కారణంగా ఇది సాధ్యం అయింది.‘
‘శివకార్తికేయన్ చెప్పినట్లు ఈ సినిమా అందరూ థియేటర్లలోనే చూడండి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా చేసిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం మళ్లీ చేయాలని ఉంది. ఎందుకంటే నీతో సమయం గడపాలనుకుంటున్నాను. అయితే ఇది ముగింపు కాదు. ప్రారంభం మాత్రమే.’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సముద్ర ఖని, శ్రియ కూడా ఉన్నారు. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద కొట్టిన రాజమౌళి
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
Also Read: రాజమౌళి మాట్లాడారు! సరే కానీ... హీరోలు అందుకు రెడీగా ఉన్నారా?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి