బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా చూడడానికి గల కొన్ని మెయిన్ రీజన్స్ ఇప్పుడు చూద్దాం.
పురాతన భారతీయ అస్త్రాల బ్యాక్‌డ్రాప్‌లో..
ఈ సినిమాను అయాన్ ముఖర్జీ అనే యంగ్ డైరెక్టర్ రూపొందించారు. పదేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నారాయన. ఈ సినిమా అతడి డ్రీమ్ ప్రాజెక్ట్. ఫైనల్ గా ప్రపంచానికి తన కలను పరిచయం చేయబోతున్నారు. ఆస్ట్రావర్స్ అనే పేరుతో ఒక ఫాంటసీ వరల్డ్ ని ఈ సినిమా కోసం సృష్టించారు. పురాతన భారతీయ అస్త్రాలను కాపాడే ఓ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఆడియన్స్ కి ఒక విజువల్ వండర్.
అయాన్ ముఖర్జీతో రణబీర్ కొలాబోరేషన్..
రణబీర్ కపూర్ తో అయాన్ ముఖర్జీ తీస్తోన్న మూడో సినిమా ఇది. వీరిద్దరూ గతంలో 'వేకప్ సిద్', 'యే జవానీ హే దివానీ' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ముఖ్యంగా 'యే జవానీ హే దివానీ' ఒక కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. ఇన్నేళ్లయినా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అయాన్ ముఖర్జీ తన కెరీర్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే తీశారు. అది కూడా 'బ్రహ్మాస్త్ర'తో కలుపుకొని. ఈ మూడు సినిమాల్లో కూడా రణబీర్ కపూరే హీరో. తన బెస్ట్ ఫ్రెండ్, ఫేవరెట్ హీరో రణబీర్ ను అయాన్ తెరపై ఎలా చూపించారో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
'బ్రహ్మాస్త్ర'తో మొదలైన రణబీర్ లవ్ స్టోరీ..
రణబీర్ కపూర్, అలియాభట్ కపుల్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సినిమా ప్రొడక్షన్ పూర్తయ్యే సమయానికి వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు అలియాభట్ గర్భవతి. అయినా.. సినిమా ప్రమోషన్స్ కోసం అన్ని ప్రాంతాలకు తిరుగుతుంది. 'బ్రహ్మాస్త్ర' తనకు ఫస్ట్ బేబీ అని.. సెప్టెంబర్ 9న అది డెలివర్ అవుతుందని ఎమోషనల్ గా చెప్పింది అలియా. రియల్ లైఫ్ కపుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ క్యాస్టింగ్..
ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు కనిపించబోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'గురు' పాత్ర పోషించారు. అస్త్రాలకు రక్షణ కల్పించే ఒక గ్రూప్ కి లీడర్ గా ఆయన కనిపించనున్నారు. నంది అస్త్రాన్ని కాపాడే అనీష్ క్యారెక్టర్ లో నాగార్జున కనిపించనున్నారు. డార్క్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ ని కంట్రోల్ చేసే ఒక పవర్ ఫుల్ పాత్రలో మౌని రాయ్ నటించారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ పోషించినట్లు సమాచారం.
విజువల్ ఎఫెక్ట్స్..
ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ టెక్నికల్ గా హైలైట్ కాబోతున్నాయని అంటున్నారు. కొన్ని ఎఫెక్ట్స్ కి సినిమా ట్రైలర్ లో చూపించారు. ప్రీరిలీజ్ ట్రైలర్ తో మరింత ఆకట్టుకున్నారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ చాలా ఖర్చు చేశారు. ఎస్ఎస్ రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు ఈ సినిమాను ప్రెజంట్ చేయడం విశేషం. 'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నారు రాజమౌళి.
Also Read: ‘క్యాష్’లో అలియా భట్‌కు శ్రీమంతం, రణ్‌బీర్‌పై సుమ పంచ్‌లు
Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్