Love Mouli Telugu Movie: నవదీప్ హీరోగా నటించిన సినిమా 'లవ్ మౌళి'. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి సి స్పేస్ చిత్రాన్ని నిర్మించింది. దీనికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఆల్రెడీ విడుదలైన నవదీప్ లుక్స్, సినిమా టీజర్, 'ఏంత‌మ్ ఆఫ్ ల‌వ్ మౌళి' పాటకు మంచి స్పంద‌న వ‌చ్చింది. 'న‌వ్ దీప్ 2.O' అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. నవదీప్ అంత కొత్తగా ఉన్నారని చెబుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 


జ్యూక్ బాక్స్ విడుదల చేసిన రవితేజ
'లవ్ మౌళి' సినిమాలో పాటలను తాజాగా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే... ఆ పాటలు సినిమాలో ఎవరైతే పాడారో వాళ్ళ చేత ఈవెంట్‌లో పాడించారు. ఆ తర్వాత ఆ గాయనీ గాయకుల చేత సాంగ్స్ విడుదల చేయించారు. ఆ తర్వాత ఆ సాంగ్స్ జ్యూక్ బాక్స్ సోషల్ మీడియాలో రవితేజ విడుదల చేశారు. మాస్ మహారాజా లేటెస్ట్ సినిమా 'ఈగల్'లో నవదీప్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


Also Read: లవర్‌కు హ్యాండ్ ఇస్తున్న 85 శాతం అమ్మాయిలు - రీసెంట్ రీసెర్చ్ గురించి 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ ఏమన్నారంటే?






'లవ్, మౌళి' సినిమాలోని పాటలను ఇలా వినూత్నంగా విడుదల చేయడం... మాస్ మహారాజా రవితేజ గారు జూక్ బాక్స్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని హీరో నవదీప్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నా ఆలోచ‌న విధానానికి, నేను చేయాల‌నుకుంటున్న సినిమాల‌కు 'ల‌వ్, మౌళి' ద‌గ్గ‌ర‌గా అనిపించింది. మీ ముందుకు స‌రికొత్త చిత్రంతో రాబోతున్నాను'' అని చెప్పారు.


ఒంటి మీద నూలు పోగు లేకుండా...
కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన 'లవ్ మౌళి' హీరో టీజర్ కొందరికి షాక్ ఇస్తే... రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొత్త రకం సినిమాలు కోరుకునే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీజర్ ప్రారంభమే ఒంటి మీద నూలు పోగు లేకుండా నవదీప్ కనిపించారు. మందు బాటిల్ పగలగొట్టి వైవిధ్యంగా కనిపించారు. సినిమాలో హీరో హిప్పీ తరహా రోల్ చేశారని అర్థం అవుతోంది.


Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?



ద‌ర్శ‌కుడు అవనీంద్ర మాట్లాడుతూ ''నా జీవితంలో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే 'లవ్ మౌళి' క‌థ‌. ప్రేమలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. నా స్వీయ అనుభవాలను ఈ కథగా మలిచా'' అని అన్నారు. నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: నైరా క్రియేషన్స్ - శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సి స్పేస్, సంగీత దర్శకుడు: గోవింద్ వసంత, పాట‌లు: అనంత శ్రీరామ్, కళా దర్శకత్వం: కిరణ్ మామిడి, ర‌చ‌న - దర్శకత్వం - సినిమాటోగ్రఫీ - ఎడిటింగ్: అవనీంద్ర.