Jagan Refused To Give MP Seat To Krishna Devaraya:  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో జరుగుతున్న మార్పులు ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఎన్నికల ముందు అనేక మార్పులతో పార్టీ కీలకమైన నేతలకో అధినేత జగన్ షాక్‌లు ఇస్తున్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీకి దింపుతున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. అలాంటి మార్పుల్లో నరసరావుపేట ఒకటి ఉంది. 


కృష్ణదేవరాయకు షాక్


ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయ ఉన్నారు. సౌమ్యుడిగా పేరు ఉన్న ఆయన... లోకల్‌గా మంచి పేరు ఉంది. పల్నాడు నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. రెండోసారి కచ్చితంగా నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని భావిస్తున్న కృష్ణదేవరాయకు జగన్ షాక్ ఇచ్చారు. నరసరావు పేట ఎంపీగా టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. 


గ్యాప్ ఉందని ప్రచారం


నరసరావుపేట ఎంపీ స్థానంపై చాలా కాలంగా మంతనాలు జరుగుతున్నాయి. అసలు కృష్ణదేవరాయకు మొదటి నుంచి జగన్‌తో  పడటం లేదని వార్తలు వచ్చాయి. ఓ ప్రోగ్రామ్‌లో కూడా జగన్‌ చెప్పినా వినకుండా విసురుగా బయటకు వచ్చేశారు. తర్వాత పార్టీ నేతలు ఆయనతో మాట్లాడి సర్ధి చెప్పి వేదికపైకి తీసుకెళ్లారు. పలు సందర్భాల్లో కూడా ఆయనకు పార్టీకి చాలా గ్యాప్ ఉందని అర్థమైంది. 


పార్టీ మారతారంటూ టాక్


అందుకే కృష్ణదేవరాయ ఏక్షణమైనా పార్టీ మార వచ్చని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఎప్పుడూ ఆయన ఈ విషయంపై స్పందించలేదు. ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. పార్టీతో గ్యాప్ ఉన్న విషయాన్ని మాత్రం చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల టైంలో టికెట్ విషయంపై అధినేతతో పలుమార్లు భేటీ అయ్యారు. 


ఎడతెగని చర్చలు 


పది రోజుల నుంచి నరసరావుపేట ఎంపీ సీటుపై ఎడతెగని ఉత్కంఠ నడుస్తోంది. కృష్ణదేవరాయకు సీటు ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదని టాక్. అయినా పట్టువదలన కృష్ణదేవరాయ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు శుక్రవారం సీఎంవోలో దీనిపై కొన్ని గంటల పాటు చర్చలు నడిచినట్టు తెలుస్తోంది. ఇందులో నరసరావుపేట ఎంపీ స్థానం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, కృష్ణదేవరాయ పాల్గొన్నారు. 


ఎమ్మెల్యేగా వెళ్లాలని సూచన 
చివరకు నరసరావుపేటలో కృష్ణదేవరాయకు టికెట్ ఇవ్వడం లేదని జగన్ తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. పల్నాడు ఏరియాలో ఒక్క గోపిరెడ్డి టికెట్‌ మాత్రం ఖరారు అయిందని మిగతా వారి చర్చలు వాయిదా పడ్డాయి. నరసరావుపేటలో కృష్ణదేవరాయకు టికెట్ ఇవ్వకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలకు కూడా నచ్చడం లేదని తెలుస్తోంది. 


నరసరావు పేట ఎంపీ స్థానం కృష్ణదేవరాయకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న జగన్ ఆయనకు ఎమ్మెల్యే వెళ్లాలని చూసిస్తున్నారట. ఇందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. చిలకలూరిపేటలో గుంటూరు వెస్ట్‌లో కానీ ఆయన్ని బరిలో నిలపాలని జగన్ ఆలోచిస్తున్నారట. అందుకే కృష్ణదేవరాయను నరసరావుపేట నుంచి తప్పించారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


Also Read:టీడీపీ కంచుకోట రాజమండ్రి రూరల్‌లో వైసీపీ వ్యూహం ఫలిస్తుందా?


Also Read:  తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా!