1999లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్ లో పాకిస్థాన్ నుంచి 'From Raveena Tandon to Nawaz Sharif' అని రాసి ఉన్న బాంబులను పేల్చారు. రవీనా టాండన్, మాధురీ దీక్షిత్ లను తమకు ఇచ్చేస్తే కాశ్మీర్ ను విడిచిపెడతామని పాకిస్థాన్ సైనికులు అప్పట్లో భారత సైనికులను దూషించేవారు. రవీనా టాండన్ అంటే అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఇష్టమైన బాలీవుడ్ నటి అని చెప్పేవారు.
అతడు భారతదేశ పర్యటన చేసిన సమయంలో ఓసారి రవీనా తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పారు. అయితే రవీనా పేరు రాసి ఉన్న బాంబులకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. తొలిసారి ఈ ఫొటోలపై స్పందించింది రవీనా టాండన్.
ఇలాంటి ఫొటోలు వైరల్ అయ్యాయనే విషయం తనకు చాలా రోజుల వరకు తెలియదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రవీనా. హింస అనేది రెండు పోరాట పార్టీలకు ప్రాణ నష్టం కలిగిస్తుందని.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలిగితే.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చని సలహా ఇచ్చారు.
ఏ సమస్యనైనా ప్రేమగా మాట్లాడి డీల్ చేస్తే అది వర్కవుట్ అవుతుందని.. అందరికీ సలహా ఇస్తానని అన్నారు.
రీసెంట్ గా ఈ బ్యూటీ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ 'అరణ్యక్' నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇందులో ఆమె మర్డర్ మిస్టరీను ఛేదించే అధికారి పాత్రలో కనిపించారు. ఈ సిరీస్ ను సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. త్వరలోనే దీనికి సెకండ్ సీజన్ రాబోతుంది.