పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఒకరు ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. 'రాధేశ్యామ్' సినిమాకి రూ.500 కోట్ల ఓటీటీ డీల్ వచ్చిందని ట్వీట్ వేయడంతో.. ఇక ఈ సినిమాను ఓటీటీలోనే చూడాలేమోనని అభిమానులు ఆందోళన చెందారు.
దీంతో సోషల్ మీడియా వేదికగా దర్శకనిర్మాతలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ రూమర్స్ పై స్పందించిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రిలీజ్ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ విషెస్ చెప్పిన రాధాకృష్ణ కుమార్.. చివర్లో 'రాధేశ్యామ్' ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. 'రాధేశ్యామ్' సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతుందని చెప్పారు.
దీంతో 'రాధేశ్యామ్' ఓటీటీ రిలీజ్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ క్రమంలో మరో నెటిజన్ థియేటర్లలోకి అయినా.. ఎప్పుడొస్తుంది అన్నా..? అని రాధాకృష్ణను ప్రశ్నించాడు. దానికి ఆయన.. 'పరిస్థితులు ఎప్పుడైతే చక్కబడతాయో అప్పుడే సినిమా రిలీజ్ అవుతుందని' అన్నారు. ఇక పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. ఈ సినిమాకి తమన్ బీజియమ్ అందిస్తున్నారు.
Also Read: 'వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత'.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ చూశారా..?
Also Read: 'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..