రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో మీడియాటెక్ జీ96 4జీ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని గ్లోబల్ లాంచ్ కూడా ఈ వారంలోనే జరగనుంది.


రెడ్‌మీ నోట్ 11ఎస్ ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది. దీని స్పెసిఫికేషన్లను ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ట్వీట్ చేశారు. రెడ్‌మీ నోట్ 10ఎస్ మనదేశంలో రూ.14,999 ధరతో లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర దీని కంటే రూ.1,000-రూ.2,000 ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11ఎస్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.


రెడ్‌మీ నోట్ 11ఎస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం.. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ హీలియో జీ96 4జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో అందించనున్నారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉండనుంది.


ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. రెడ్‌మీ నోట్ 11ఎస్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


రెడ్‌మీ నోట్ 11 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కూడా జరగనుంది. లాంచ్‌కు ముంగిట దీనికి సంబంధించిన కొత్త టీజర్‌ను షియోమీ టీజ్ చేసింది. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డాట్‌డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్ ఉండనుంది.