టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు హనురాఘవపూడి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ కీలకపాత్ర పోషిస్తోంది. ముందుగా 'లెఫ్టినెంట్ రామ్' పేరుతో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పడు టైటిల్ మార్చారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు చిన్న వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. 


'ఇదో సైనికుడు శత్రువుకి అప్పగించిన యుద్ధం అఫ్రీన్.. ఈ యుద్ధంలో సీతారాములను నువ్వే గెలిపించాలి' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తరువాత అఫ్రీన్ రోల్ పోషిస్తున్న రష్మిక.. 'సీతారాములా..? ఎవరు వాళ్లు' అని ప్రశ్నిస్తుంది. వెంటనే మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లను చూపిస్తారు. 40 సెకన్ల ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి 'సీతారామం' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. 


ఈ సినిమాకి యుద్ధంతో రాసిన ప్రేమ క‌థ అనే క్యాప్ష‌న్ పెట్టారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో హనురాఘవాపుడి డైరెక్ట్ చేసిన సినిమాలు వర్కవుట్ అవ్వలేదు. మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడతారేమో చూడాలి!


Also Read: వీరమల్లు షూటింగ్‌కు ముందు పవన్ కల్యాణ్ శ్రీరామ నవమి పూజ


Also Read: విజయ్ 66లో పూజా హెగ్డే బదులు రష్మికను తీసుకోవడం కారణం ఏంటంటే?