Ranga Maarthaanda: సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం నటించిన 'రంగమార్తాండ' చిత్రం అన్ని వర్గావ వారినీ ఆకర్షిస్తోంది. మార్చి 22న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. మొన్నటి దాకా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. ఏప్రిల్ 7న ఓటీటీలోకి వచ్చింది. ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ర్టీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు 'రంగమార్తాండ' మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న టాప్ 10 సినిమాల విభాగంలో ఈ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.


ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా సినిమాలు తీసే డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా 'రంగమార్తాండ'. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం లాంటి మోస్ట్ టాలెంటెడ్ అండ్ సీనియర్ యాక్టర్స్ నటించిన సినిమాను కృష్ణవంశీ అద్భుతంగా చిత్రీకరించారు. మనసుకు హత్తుకునేలా, థియేటర్‌లలో నుంచి బరువైన గుండెలతో బయటకు వచ్చేలా ఎమోషన్‌లా కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రారంభంలో విడుదల టీజర్, ట్రైలర్ కు నిర్వాహకులు ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేశారు. విడుదలకు ముందే ప్రీమియర్లు వేసి మరీ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో మేకర్స్‌ స్పష్టం చేశారు. అలా మార్చి 22న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ముందు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. విడుదలైన తేదీ నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 


మైత్రీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓ కళాకారుని జీవితాన్ని కళ్లకద్దేలా చూపించింది. సినిమాలోని బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్ వారు తమ పాత్రకు 100 శాతం న్యాయం చేయడంతో ప్రేక్షకున్ని సెంటిమెంటల్ గా, ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. అందులో ముఖ్యంగా బ్రహ్మానందం క్యారెక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆయన లైఫ్ లోనే ఇలాంటి పాత్ర చేయడం మొదటి సారి కావడం, చాలా నేచురల్‌గా తన పాత్రను పండించడం సినీ ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లీగంజ్‌ కీలక పాత్రలను పోషించారు. వారు కూడా సినిమాకు ప్రాణం పోశారు. 


మారాఠి సినిమా 'నటసామ్రాట్‌'కు రీమేక్‌గా తెరకెక్కిన 'రంగమార్తాండ' సినిమా ఇప్పటివరకు సినీ ప్రేక్షకులనే కాదు, మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులనూ కంటితడి పెట్టించింది. ఈ సినిమా చూశానని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని ఆయన కితాబివ్వడం గమనార్హం. ఇక డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం రావడంతో ప్రేక్షకులు సైతం ఆదరించారు. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు.. మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం మరో విశేషం.


'రంగమార్తాండ' ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఏప్రిల్ 7న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న ఈ సినిమా.. కేవలం రెండు రోజుల్లోనే ఆడియన్స్ నుంచి సూపర్ క్రేజ్ అందుకుంటోంది.  ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఇండియన్ వైడ్ ట్రెండ్రింగ్ లో నిలిచింది. యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉన్న 'టాప్ 10 మూవీస్'లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తమ సినిమాకి ఇంతటి ఆదరణ అందిస్తున్న ప్రేక్షకాభిమానులకి డైరెక్టర్ కృష్ణవంశీ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


Also Read : ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్‌ గా, సింగిల్ క్యారెక్టర్‌ తో సినిమా