Ramajogayya Sastry deactivates Twitter account: 'గుంటూరు కారం' సినిమా దర్శక నిర్మాతలతో పాటు సంగీత దర్శకుడు తమన్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రిపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కనబడుతోంది. మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకొంటున్న కొందరు 'ఓ మై బేబీ' సాంగ్ విడుదల తర్వాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు... విమర్శలకు దిగారు. దాంతో ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేశారు రామజోగయ్య శాస్త్రి. పూర్తి వివరాల్లోకి వెళితే...
'ఓ మై బేబీ' నచ్చలేదు గురూజీ!
Trolls on Oh My Baby song from Guntur Kaaram movie: 'ఓ మై బేబీ' పాట ఇలా విడుదలైందో? లేదో? సోషల్ మీడియాలో అలా విమర్శల వెల్లువ మొదలైంది. ఆ సాంగ్ ఏంటి? అంటూ కొందరు అభిమానులు విమర్శలు మొదలుపెట్టారు. వరస్ట్ లిరిక్స్, మ్యూజిక్, ప్రొడ్యూసర్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. సదరు విమర్శ పట్ల రామజోగయ్య శాస్త్రి స్పందించారు.
కుక్కల చేతిలో సోషల్ మీడియా!
Ramajogayya Sastry reacts on Trolls: విమర్శల పట్ల రామజోగయ్య శాస్త్రి కొంచెం పరుష పదజాలంతో స్పందించారు. ''సోషల్ మీడియా కుక్కల చేతిలోకి వెళుతోంది. సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులను టార్గెట్ చేస్తూ... కేవలం వాళ్లపై వ్యతిరేకత, ద్వేషం చిమ్ముతూ పోస్టులు చేయడం సరికాదు. అది ఎంత మాత్రం బాలేదు. పాట గురించి అసలు తెలియని వాళ్ళు తాము కామెంట్ చేయగలం, జడ్జ్ చేయగలం అని అనుకుంటున్నారు. ఎవరో ఒకరు మాట్లాడాలి. గీత దాటుతున్నారు వీళ్ళు'' అని రామజోగయ్య శాస్త్రి తొలుత ట్వీట్ చేశారు.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
నెటిజనులు / హీరోల అభిమానులను కుక్కలతో పోల్చడంతో రామజోగయ్య శాస్త్రిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పందించిన తీరు సరికాదని, తమ అభిప్రాయం ఏమిటో చెప్పే హక్కు ప్రేక్షకులకు లేదా? అని ఆయనకు ఎదురు ప్రశ్నలు వేశారు. దాంతో ఆయన కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించింది. కామెంట్ చేసే హక్కు లేదని తాను అనలేదని, వాళ్ళు ఉపయోగిస్తున్న భాష బాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
పాటకు ఏం తక్కువ అయ్యిందని!?
''ప్రతివాడు మాట్లాడేవాడే
రాయి విసిరే వాడే
అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది
పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయిందని!
మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా... అదే లేకపోతే... ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం. తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి'' అని రామజోగయ్య శాస్త్రి మరో ట్వీట్ చేశారు. ఆయన ఏం చెప్పినా సరే విమర్శల జడివాన ఆగలేదు. దాంతో చివరకు ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేశారు. అదీ సంగతి! మరి, సినిమా విడుదలకు ముందు ఈ ట్రోల్స్ మీద దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్, హీరో మహేష్ బాబు ఏమని సమాధానం చెబుతారో? వెయిట్ అండ్ సి.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!