కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇటీవల తన సినిమా ప్రెస్ మీట్ లో 'కేజీఎఫ్2' సక్సెస్ గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇకపై హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదని సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రియాక్ట్ అయ్యారు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదనప్పుడు.. నువ్ మాతృభాషలో నటించే సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నావ్..? అంటూ సుదీప్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఇది చూసిన సుదీప్.. 'నేను చెప్పిన కాంటెక్స్ట్ కంప్లీట్ డిఫరెంట్.. అది మీ వరకు వేరే అర్ధం వచ్చేలా రీచ్ అయింది. ఎవరినైనా హర్ట్ చేయాలని కానీ.. వాదించాలని కానీ ఆ కామెంట్స్ చేయలేదు. నేను మిమ్మల్ని పెర్సనల్ గా కలిసినప్పుడు ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడానో వివరిస్తాను. మన దేశంలో ఉన్న అన్ని భాషలను నేను గౌరవిస్తాను' అంటూ బదులిచ్చారు. ఆ తరువాత అజయ్ దేవగన్.. తప్పుగా అర్ధం చేసుకున్నానని అన్నారు. పూర్తి విషయం తెలియకుండా రియాక్ట్ అయితే ఇలానే జరుగుతుంటుందని.. ఘాటుగా బదులిచ్చారు సుదీప్.
ఈ మొత్తం విషయంపై సంచలన దర్శకుడు ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. సౌత్, నార్త్ అని కాదని.. ఇండియా అంతా ఒక్కటే అని అందరూ తెలుసుకోవాలని అన్నారు. ప్రాంతీయత, అక్కడ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భాషలనేవి వృద్ధి చెందాయని చెప్పారు. 'కేజీఎఫ్2' సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు ఓపెనింగ్స్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేయడంతో.. ఉత్తరాది స్టార్స్ దక్షిణాది హీరోలపై అసూయతో ఉన్నారని ఆర్జీవీ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.
ఇకపై బాలీవుడ్ సినిమాల ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో మనమూ చూద్దామని.. బాలీవుడ్ లో బంగారం ఉందా..? లేక కన్నడలో బంగారం ఉందా..? అనేది 'రన్ వే 34' ఓపెనింగ్ కలెక్షన్స్ వలన అర్ధమవుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు
Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే