సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు సినీ పెద్దలు.. ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను, సింగర్లను లోబరచుకున్నారు. అవకాశాల పేరుతో తమను శారీరకంగా వాడుకున్నారంటూ ఇప్పటికే చాలా మంది నటీమణులు, సింగర్లు మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
మాలీవుడ్ కి చెందిన నటుడు, నిర్మాత విజయ్ బాబుపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అవకాశం ఇప్పిస్తానంటూ ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కేరళలోని కోజీకోడ్ లో కేసు నమోదైంది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో విజయ్ బాబుకి నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు ఇతడిపై లైంగిక ఆరోపణలు చేశారు.
ఈ కోజికోడ్ పోలీస్ స్టేషన్ లో విజయ్ బాబుపై కేసు నమోదైంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ విజయ్ బాబు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని అందులో నటి పేర్కొన్నారు. ఏప్రిల్ 22న విజయ్ బాబుపై నటి ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని తెలుస్తోంది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 14 వరకు విజయ్ పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఇక విజయ్ మలయాళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలతో కూడా అతడికి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. మరి ఈ కేసుపై అతడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి!
Also Read: శోభన్ బాబు, నాగార్జున రూటులో షణ్ముఖ్ - రీసెంట్‌గా ఏం చేశాడో తెలుసా?
Also Read: 'ఆచార్య'లో కనిపించని కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?