లీక్స్... మెగా లీక్స్... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యేలా చేసింది. 'ఆచార్య' ప్రచారంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివను మెగా అభిమాని, దర్శకుడు అయిన హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేశారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' సినిమా చేశారు. త్వరలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 


'గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానులు విజిల్స్ వేసే డైలాగులు రాశారు హరీష్ శంకర్. ఇప్పుడు 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా కోసం కూడా అటువంటి డైలాగులు రాస్తున్నారు. వాటిలో ఓ డైలాగ్ చిరంజీవికి చెప్పారు. ఆయన ఆ డైలాగ్ మరోసారి చెప్పమని ఇంటర్వ్యూలో కోరడంతో హరీష్ శంకర్ చెప్పక తప్పలేదు. ఇంతకీ, ఆ డైలాగ్ ఏంటంటే... 


చిరంజీవి: మొన్న ఏదో డైలాగ్ చెప్పావ్! భలే ఉందనిపించిందయ్యా... 
హరీష్ శంకర్: అది 'భవదీయుడు భగత్ సింగ్' డైలాగ్ సార్
చిరంజీవి: చెప్పొచ్చా?
హరీష్ శంకర్: కెమెరాలు ఆఫ్ చేయండి!
చిరంజీవి: లీక్ చేద్దాం... నేను చెబుతా
హరీష్ శంకర్: హీరోగారు నడుచుకుంటూ వస్తే వెనకాల చాలా మంది స్టూడెంట్స్ నడుచుకుంటూ వస్తారు. అది చూసిన విలన్ కంగారు పడి 
''మొన్న వీడు మన ఇంటికి వచ్చి పెద్దగా అరిచినప్పుడు 'ఏంటి వీడి ధైర్యం అనుకున్నాను. ఇప్పుడు అర్థం అయ్యింది. నడిస్తే వీడి వెనకాల లక్షమంది నడుస్తారు. బహుశా... ఇదే ఇతడి ధైర్యం ఏమో'' అంటాడు. అతడి పక్కన ఉన్న వ్యక్తి ''లేదు సార్! ఆ లక్ష మందికి ఆయన ముందు నడుస్తున్నాడన్న ధైర్యం'' అని చెబుతాడు. (హరీష్ శంకర్ ఈ సన్నివేశం వివరించారు)


విన్న వెంటనే దర్శకుడు కొరటాల శివ చప్పట్లు కొట్టారు. 'బాగా రాశాడు' అని  కొరటాలతో చిరంజీవి చెప్పారు. హరీష్ శంకర్ ను మెచ్చుకున్నారు. 'సూపర్బ్! చాలా బావుంది' అని రామ్ చరణ్ అన్నారు. 'మెగా లీక్స్' అంటూ హరీష్ శంకర్ అన్నారు.


Also Read: 'నీ షర్ట్ బటన్స్ తీసేయ్' - అషుపై శివ చేసిన వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు






ప్రస్తుతం 'హరి హార వీరమల్లు' షూటింగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అది పూర్తి అయిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Also Read: శోభన్ బాబు, నాగార్జున రూటులో షణ్ముఖ్ - రీసెంట్‌గా ఏం చేశాడో తెలుసా?