యాంకర్ శివ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఈ షోలో తన కామెడీ పంచ్ లతో, గేమ్ తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తన స్టైల్ లో గేమ్ ఆడుతూ.. ప్రేక్షకులను మెప్పించడానికి కష్టపడుతున్నాడు. టాప్ 5లో అతడు ఉండడం ఖాయమని అంటున్నారు. కానీ సోమవారం జరిగిన నామినేషన్స్ నుంచి శివపై వ్యతిరేకత మొదలైంది. నామినేషన్స్ సమయంలో అషు.. శివపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 


బిగ్ బాస్ హౌస్ లో శివ ఓసారి లేడీ గెటప్ వేసుకున్నాడు. దానికి అషూనే తన జాకెట్, షాట్, జాకెట్ లోపల వేసుకునే లోదుస్తులను కూడా శివకు ఇచ్చింది. అయితే ఆ సమయంలో శివ పదేపదే షర్ట్ బటన్స్ తీసేయ్ అని అనడం తనకు నచ్చలేదని నామినేట్ చేసింది. 'నీ ఉద్దేశం ఏదైనా కానీ.. ఆ పదాలు వాడడం నచ్చలేదని' అషు చెప్పింది. ఆ సమయంలో హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు. 


తప్పు చేశానని గ్రహించిన శివ సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద దుమారం నడుస్తోంది. అసలు అషు, శివల మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే.. ముందుగా శివ లేడీస్ బట్టలు కావాలని అషూని అడుగుతూ.. లోదుస్తుల గురించి కూడా ప్రస్తావించాడు. అషు వేసుకున్న లాంటి లోదుస్తులు కావాలని చెప్పడం కోసం 'బటన్స్‌ తీయ్‌, నీ షర్ట్‌ బటన్స్‌ తీయ్‌, ఆ టైప్‌ కావాలి' అని అన్నాడు. 


అది విన్న అషురెడ్డి.. 'దానికి బటన్స్ తీయమనడం ఎందుకు.. ఆగు నేనిస్తా' అంది. వెంటనే శివ.. 'అహా.. ఆ టైప్ కావాలని అడుగుతున్నా..' అని చెప్పాడు. ఆ తరువాత అషు లోదుస్తులను ఇస్తూ.. తను వేసుకున్నది కూడా ఇలాంటిదేనని శివని ట్రై చేయమని చెప్పింది. ఈ మొత్తం సంభాషణలో శివ.. అషుని బటన్స్ తీయమని అడగడం స్పష్టంగా ఉండడంతో ఆమె అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఒక అమ్మాయితో ఇలానే మాట్లాడతావా..? ఆమె వేసుకున్న షర్ట్ బటన్స్ తీయమని అడగడం ఏంటని ఫైర్ అవుతున్నారు. 


Also Read: శోభన్ బాబు, నాగార్జున రూటులో షణ్ముఖ్ - రీసెంట్‌గా ఏం చేశాడో తెలుసా?


Also Read: 'ఆచార్య'లో కనిపించని కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?