నటి లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'హ్యాపీ బర్త్ డే'. 'మత్తు వదలరా'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా రూపొందిస్తోన్న రెండో సినిమా ఇది. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూలై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిన్న చిన్న టీజర్స్ ను వదిలారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
దర్శకధీరుడు రాజమౌళి ట్రైలర్ ను రిలీజ్ చేయడం విశేషం. సరియల్ కామెడీ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ మొత్తం డిఫరెంట్ కామెడీతో నింపేశారు. ఒక లైటర్ ను దక్కించుకోవడం కోసం కొన్ని గ్యాంగ్స్ ప్రయత్నిస్తుంటాయి. ఆ లైటర్ స్పెషాలిటీ ఏంటో ప్రస్తుతానికైతే సస్పెన్స్. టాలీవుడ్ లో పేరున్న కమెడియన్స్ అందరూ ఈ ట్రైలర్ లో కనిపించారు. గన్స్, గ్యాంగ్స్, గర్ల్స్ తో సాగిన ఈ ట్రైలర్ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను కలిగింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించింది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ సినిమాను నిర్మించారు. కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి