రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “అనుభవించు రాజా”. ఈ మూవీపై రాజ్ తరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా ప్రేక్షకులన ఆకట్టుకునేందుకు  ప్రచారం జోరు పెంచారు. ఇప్పటికే నాగార్జున, రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ లాంచ్ చేయగా  ఈరోజు గా  నాగ చైతన్య  ఈ సినిమాలో  మొదటి పాటను విడుదల చేశారు.





గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ను రామ్ మిరియాలా ఆలపించారు.  "రాజు వెడలె రవితేజములలరగ .. నారీ మణుల కళ్లు చెదరగ .. వైరి వీరుల గుండెలదరగా" అంటూ మొదలైన పాట అడిగేదెవరు-ఆపేదెవరు-అనుభవించు రాజా...అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ .. కల్లుకైనా కనికరించవా .. మందుకైనా మన్నించవా" అంటూ సాగిన ఈ పాటకి  భాస్కరభట్ల  సాహిత్యం అందించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, జాతర వాతావరణంలో పాట మాంచి హుషారుగా సాగింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్.  అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఫై సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అనుభవించు రాజా’షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రమోషన్ జోరందుకుంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.  రాజ్ తరుణ్ తో గతంలో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చేసిన శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలోఈ సినిమా పూర్తిగా కోనసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. 


 


ఇక రాజ్ తరుణ్-సందీప్ మాధవ్  హీరోలుగా స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వంలో నూతన చిత్రం ''మాస్ మాహారాజు' పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి.  ఎం.అసిఫ్ జానీ నిర్మిస్తున్న  ఈ సినిమాలో  సిమ్రత్, సంపద హీరో,హీరోయిన్లు. ఈ సినిమాలో హీరోలిద్దరూ ఒకరి కోసం, ఒకరు ఏం త్యాగం చేశారన్నదే కథ. ఫ్రెండ్షిప్ కోసం తీస్తున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ ఎవరు చూసినా మా ఇద్దరి జీవితాల్లో ఇటువంటి కథ జరిగిందని అనుకునేలా సినిమా ఉంటుందన్నారు మేకర్స్. త్వరలో షూటింగ్ మొదలు పెట్టి రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అంటే అనుభవించు రాజా విడుదలైన కొద్ది రోజుల్లోనే 'మాస్ మాహారాజు' కూడా రానుందన్నమాట.


Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: గరంగరంగా ఆరోవారం నామినేషన్లు…ఆ ఆరుగురిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి