యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కె'. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. అందులో అమితాబ్ బచ్చన్  కూడా పాల్గొంటున్నారు. సినిమాలో ఆయన ఓ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ప్రాజెక్ట్ కె'లో మాత్రమే కాదు... 'రాధే శ్యామ్' సినిమాలోకి అమితాబ్‌ను తీసుకు వచ్చారు ప్రభాస్. ఆ సినిమాలో ఆయన కనిపించరు... వినిపిస్తారంతే!


ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధే శ్యామ్'. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 11న విడుదల కానుంది. ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే... అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్. సినిమాలో ఆయన గళం వినిపిస్తుందని ఈ రోజు 'రాధే శ్యామ్' బృందం ప్రకటించింది.


Also Read: వైసీపీతో త్రివిక్రమ్ ప్లాన్? అందుకే, 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌కు బండ్ల గణేష్ దూరమా? లీక్డ్ ఫోన్ కాల్‌లో నిజమెంత?







Also Read: దగ్గుబాటి వారసుడితో తేజ సినిమా - 'అహింస', అది 'అఖండ'లో బాలకృష్ణ డైలాగే!






కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్య శ్రీ, మురళీ  శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన 'రాధే శ్యామ్' సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ నిర్మించారు. హిందీలో టీ - సిరీస్ నిర్మాణ భాగస్వామి. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందించగా...  మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ హిందీలో పాటలకు స్వరాలు అందించారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.