మూవీ మొఘల్ రామానాయుడు, దగ్గుబాటి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. బాబాయ్ వెంకటేష్, అన్నయ్య రానా బాటలో నడుస్తూ... నిర్మాత సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ కూడా హీరో అవుతున్నారు. ఈ సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అభిరామ్ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు 'అహింస' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు తేజ పుట్టినరోజు సందర్భంగా ప్రీ లుక్ విడుదల చేశారు. టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా పేర్కొన్న కోట్ (స్టోరీ లైన్) అయితే... నట సింహ నందమూరి బాలకృష్ణ 'అఖండ'లో డైలాగ్ గుర్తు చేసిందని చెప్పాలి.



'అహింసా పరమో ధర్మః
ధర్మహింసా తధైవచ!!'
- ఇది హిందూ శాస్త్రంలో ఉన్నదే.
అయితే... ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమాలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను మరోసారి గుర్తు చేశారు. దానినే 'అహింస' ప్రీ లుక్‌తో కోట్ చేశారు. ఆ లైన్స్ మీద సినిమా ఉంటుందేమో!?

ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో అభిరామ్ దగ్గుబాటి కథానాయకుడిగా పరిచయం అవుతున్న 'అహింస' సినిమాను ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పి కిరణ్ ('జెమిని' కిరణ్‌) నిర్మాత. ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. 'చిత్రం' సినిమాతో ఆయన్ను సంగీత ద‌ర్శ‌కుడిగా తేజ ప‌రిచ‌యం చేశారు. తర్వాత ఇద్దరి కలయికలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత వాళ్లిద్ద‌రు క‌లిసి చేస్తున్న చిత్రమిది.


Also Read: వైసీపీతో త్రివిక్రమ్ ప్లాన్? అందుకే, 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌కు బండ్ల గణేష్ దూరమా? లీక్డ్ ఫోన్ కాల్‌లో నిజమెంత?


'అహింస' షూటింగ్ కంప్లీట్ అయ్యిందని ప్రీ లుక్ విడుదల చేసిన సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ సినిమాలో పాటలు అన్నీ చంద్రబోస్ రాశారు. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమెరా: సమీర్ రెడ్డి, ఫైట్స్: రియల్ సతీష్


Also Read: ఇది కదా మాస్ అంటే - పవన్, రానా క్లాష్ వేరే లెవల్ - భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది!