దివంగత కథానాయకుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) భౌతికంగా ప్రేక్షకులకు దూరం అయ్యారు. అయితే... సినిమాల ద్వారా ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల దగ్గరే. ఈ నెలలో ఆయన చివరి సినిమా (Puneeth Last Movie) ప్రేక్షకుల దగ్గరకు రానుంది. 


Puneeth Rajkumar's Gandhada Gudi Movie Trailer Released : పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా 'గంధాద గుడి'. జాతీయ పురస్కార గ్రహీత అమోఘ వర్ష దర్శకత్వం వహించారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. అది చూస్తే... వన్య ప్రాణుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. ఓ స్పెషల్ ఐలాండ్‌కు పునీత్ వెళ్లడం... అక్కడ వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ చేయడం చూపించారు.


ప్రేక్షకుల చూపు పునీత్ మీదే!
'గంధాద గుడి' (Gandhada Gudi Movie) ట్రైలర్ చూస్తే... విజువల్స్ చాలా బావున్నాయి. డిస్కవరీ ఛానల్‌లో చూపించే విజువల్స్‌కు ఏమాత్రం తక్కువ లేవు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, స్టోరీ... అన్నీ బావున్నాయి. అయితే... ట్రైలర్ చూస్తే ప్రేక్షకుల చూపు మాత్రం పునీత్ మీద ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన నవ్వు ముత్యం వలే మెరిసింది. ఆయన మేనియా నక్షత్రం వలే ప్రకాశించింది. మధ్యలో కన్నడ కంఠీరవ, పునీత్ తండ్రి రాజ్ కుమార్ విజువల్ కూడా చూపించారు. పునీత్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్న ఆ దృశ్యం ఎంతో లైవ్లీగా ఉంది.   



నెలాఖరున థియేటర్లోకి!
'గంధాద గుడి' చిత్రాన్ని ఈ నెలాఖరున... 28వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని నిర్మాత. కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ చేయడం లేదో? లేదంటే ఆ సమయానికి తెలుగు వెర్షన్ కూడా తీసుకు వస్తారో చూడాలి!


Also Read : Chiranjeevi Emotional Speech At Godfather Success Meet : 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?


పునీత్ రాజ్ కుమార్ తన స్టార్‌డ‌మ్‌ పక్కన పెట్టి మరీ అమోఘ వర్షతో కలిసి ట్రావెల్ చేశారని, కొత్త కథల కోసం అన్వేషించారని 'గంధాద గుడి' చిత్ర బృందం పేర్కొంది. నిజమైన కథానాయకుడి ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పింది. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని స్పష్టం చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పునీత్ అంటే ప్రేక్షకులలో ఉన్న సదాభిప్రాయం, మంచి పేరు దృష్ట్యా సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. 


Puneeth Rajkumar's Civil Engineer Movie : పునీత్ రాజ్ కుమార్, రచితా రామ్ (Rachitha Ram) జంటగా నటించిన కన్నడ సినిమా 'చక్రవ్యూహ'ను తెలుగులో 'సివిల్ ఇంజనీర్'గా డబ్ చేశారు. అందులో అరుణ్ విజయ్ (Arun Vijay) విలన్ రోల్. దసరాకు టీజర్ విడుదల చేశారు. త్వరలో ఆ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. 


Also Read : Chiranjeevi Vs Garikapati : 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్