మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వర్సెస్ గరికపాటి నరసింహా రావు (Garikapati Narasimha Rao) ఎపిసోడ్‌కు ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. మెగా అభిమానుల ఆగ్రహం చూస్తుంటే... ఇప్పట్లో పడేలా కనిపించడం లేదు. గరికపాటి నరసింహా రావు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మెగాస్టార్‌ను క్షమాపణ కోరితే తప్ప శాంతించేలా కనిపించడం లేదు. 


''గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అని ఉంటారు. ఆయన లాంటి పండితులు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలని అన్నామే తప్ప... ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలనే కోరిక మాకు లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనను అర్థం చేసుకోవాలి. ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రిక్వెస్ట్'' అని నాగబాబు ట్వీట్ చేశారు. అయినా మెగా ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారలేదు. ఆఖరికి 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి ఎపిసోడ్ కంటిన్యూ అయ్యింది. 


ఇండస్ట్రీలోని దర్శకులలో మెగా అభిమానుల లిస్టు తీస్తే అందులో దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) పేరు ముందు వరుసలో ఉంటుంది. శనివారం రాత్రి జరిగిన 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లో స్టేజి మీద ఆయన గరికపాటిపై పరోక్షంగా విమర్శలు చేశారు. 


చిరుకు సరిసాటి రాని గరికపాటి!?
సినిమా గురించి మాట్లాడిన తర్వాత చివరిగా ఒకే ఒక మాట చెబుతానంటూ కె.ఎస్. రవీంద్ర ''చిరంజీవి గారు నిశ్శ‌బ్ద విస్పోట‌నం అని మాట్లాడిన మాట అర్థం ఏమిటనేది ఇటీవల, రెండు రోజుల క్రితమే నాకు తెలిసింది. ఎవడు ప‌డితే వాడు... మాట మాటకీ, (చిరంజీవికి) స‌రిసాటి రాని వాళ్ళందరూ మాట్లాడుతుంటే... చిన్న చిరు నవ్వుతో ఆయన ఆయన చేసుకుంటూ ఆ క్ష‌ణం అలా పోయేలా ఆయన పనికి వెళ్తున్నారు. ఇదీ నిశ్శబ్ద విస్ఫోటనం అంటే! 153 సినిమాలకు ఆయన చిరునవ్వే ఆయన సమాధానం హ్యాట్సాఫ్ టు అన్నయ్య'' అని చురకలు వేశారు. 


ఆయన అలా మాట్లాడొచ్చా...
ఘాటుగా స్పందించిన చోటా!
బాబీ పరోక్షంగా గరికపాటిపై విమర్శలు చేస్తే... సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఘాటుగా స్పందించారు. తాను చిరంజీవిని తప్ప ఎవరికీ కేర్ చేయనని ఆయన చెప్పారు. తనకు తల్లి, తండ్రి, గురువు మెగాస్టారేనని తెలిపారు. చిరు గొప్పతనం వివరించారు. ఆ తర్వాత ''ఈ మ‌ధ్య ఓ బుల్లి ఇన్సిడెంట్ జ‌రిగింది. చిరంజీవి గారిపై అభిమానంతో ఫోటోలు తీసుకుంటున్నాం. ఆడెవ‌డో… మాట్లాడేవాడు మ‌హా పండితుడు. ఆయన అలా మాట్లాడొచ్చా అండీ? అది త‌ప్పు క‌దా!? అలాంటి వాడిని కూడా ఆయన (చిరంజీవి) ఇంటికి ఆహ్వానిస్తుంటే... 'మా ఇంటికి రండి' అని చెబుతుంటే... నాకు 'ఇది క‌దా సంస్కారం! ఇది క‌దా మేం నేర్చుకుంటున్నాం'' అని చోటా కె. నాయుడు మండిపడ్డారు. ఎప్పుడూ తమకు మెగాస్టార్ చిరంజీవి దేవుడు, గురువు అని మరోసారి పేర్కొన్నారు. 


Also Read : Chiranjeevi - Godfather : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో



చిరంజీవి వర్సెస్ గరికపాటి ఎపిసోడ్‌లో చాలా మంది చిరు సంస్కారాన్ని గుర్తు చేస్తున్నారు. ఫోటో సెషన్ ఆపకపోతే తాను స్టేజి దిగి వెళ్లిపోతానని గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని చెబుతున్నారు. అదే వేదికపై ఆయను ఇంటికి ఆహ్వానిస్తానన్న చిరంజీవి వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పకపోతే ఆయన ప్రవచనాలను అడ్డుకుంటామని మెగా అభిమానులు పేర్కొంటున్నారు.   


Also Read : Balakrishna - Unstoppable 2 Update : వేటకు సిద్ధమైన సింహం - ఈ నెల 14 నుంచి దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!