యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), పూరి జగన్నాధ్(Puri Jagannadh) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 25న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలు మించి ఉంది. దీంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ముందే బయటకొచ్చింది. ఈ సినిమాలో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయట. అందులో ఒకటి ప్రీ క్లైమాక్స్ అని తెలుస్తోంది. దీనికోసం భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట పూరి జగన్నాధ్. 14 మంది అమ్మాయిలతో విజయ్ దేవరకొండ ఫైట్ చేసే సీన్ అది. ఈ అమ్మాయిలంతా కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నవారని సమాచారం. వీరిని ఫారెన్ నుంచి తీసుకొచ్చారు పూరి. వీరితో విజయ్ ఫైట్ చేసే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని చెబుతున్నారు.
ఇక క్లైమాక్స్ లో అయితే ఏకంగా మైక్ టైసన్(Mike Tyson) తోనే బాక్సింగ్ సీన్ ప్లాన్ చేశారు పూరి. ఈ ఫైట్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందట. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.